Movies

కేసులు కావలెను

Hansika becomes lawyer for her new movie - కేసులు కావలెను

చాలా రోజుల తర్వాత హన్సిక కథానాయికగా నటిస్తున్న తెలుగు చిత్రం ‘తెనాలి రామకృష్ణుడు బి.ఎ. బీఎల్‌‌’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అనేది ఉప శీర్షిక. సందీప్‌ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. నేడు హన్సిక పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమాలోని హన్సిక లుక్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో హన్సిక చాలా స్టైల్‌గా కనిపించారు. సినిమాలో హన్సిక లాయర్‌ పాత్రలో కనిపించనున్నారు. మరో కథానాయిక, తమిళ నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. జి. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాటలు మినహా చిత్రీకరణ దాదాపు పూర్తైంది. ఈ ఏడాది చివరినాటికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.