తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో దోహలో ప్రొ. జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విభాగ ప్రధాన కార్యదర్శి వినాయక్ చెన్నా మాట్లాడుతూ…..సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ జీవితం అందరికీ ఆదర్శం అన్నారు. నిబద్ధత, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన జీవితం మనకు తెలియజేస్తుందని అన్నారు. వారి మాటలను ముందుతరాలకు తెలియజేస్తూ వారికి మార్గం చూపే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఉపాధ్యక్షుడు శశాంక్ అల్లకొండ మాట్లాడుతూ…”పుట్టుక నీది చావు నీది నడుమ జీవితమంతా తెలంగాణది” అన్న నినాదాన్ని నమ్మి ఆచరించిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు శేఖర్ చిలువేరి, ఎల్లయ్య తాళ్లపెళ్లి, నవీన్ అళ్లే ,మహేందర్, రమేశ్ పిట్ల తదితరులు పాల్గొన్నారు.
ఖతార్‌లో ప్రొ.జయశంకర్ జయంతి
Related tags :