కృత్రిమ మేధస్సు, వర్చ్యువల్ రియాలిటీ, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వంటి రంగాలకు చెందిన ప్రముఖ సంస్థల కోవర్కింగ్ స్పేస్‌గానే గాక స్టార్టప్ సంస్థలకు పెట్టుబడులు పెట్టే ఇన్క్యూబేటర్‌గా కూడా QhUb సేవలు అందిస్తుందని అమెరికాకు చెందిన సంస్థ వ్యవస్థాపకులు వల్లేపల్లి శశికాంత్, ప్రియంకలు తెలిపారు. శనివారం నాడు తెలంగాణా ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, యాపిల్ మాజీ సీఈఓ జాన్ స్కల్లీలు ఈ సంస్థను ప్రారంభించి ప్రసంగించారు. 50వేల చదరపు అడుగుల అతిపెద్ద సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారా భారతదేశవ్యాప్తంగానే గాక ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగానికి మంచి చేయూత లభిస్తుందని సభలో ప్రసంగించిన వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అమెరికాకు చెందిన ప్రవాసాంధ్రులు గుత్తికొండ శ్రీనివాస్, ఐకా రవి, TV5 సీఈఓ సురేంద్రనాధ్, ఎల్లా కృష్ణ, జె.ఎ.చౌదరి, చావా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో కృత్రిమ మేధకు స్వర్గధామం-QHub
Related tags :