ప్రపంచంలోనే అత్యంత పలుచని బంగారాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. రెండు అణువులంత మందంతో, మానవ గోరుకన్నా అత్యంత పలుచగా ఉన్నట్లు గుర్తించారు. బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు రూపొందించిన ఈ బంగారం ఇతర పదార్థాల అండ లేకుండా అత్యంత పలుచనిదిగా గుర్తింపు పొందింది. 0.47 నానోమీటర్ల మందం గల ఈ బంగారంలోని అణువులు ఉపరితలంపైనే ఉంటాయి. లోపల మరేతర అణువులూ ఉండవు. ఈ పదార్థంతో వైద్య ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమలో విస్తృత ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. వివిధ పారిశ్రామిక ప్రక్రియల్లో రసాయన ప్రతిచర్యల్ని వేగవంతం చేసే ఉత్ప్రేరకంగానూ పనిచేస్తుంది. ఉత్ప్రేరకంగా పది రెట్లు సమర్థంగా పని చేస్తున్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో గుర్తించారు. ఇది మైలురాయిలాంటి విజయమని పరిశోధకులు సున్జీ యే పేర్కొన్నారు. బంగారాన్ని మరింత సమర్థంగా ఉపయోగించుకోవడమే కాకుండా ఇతర 2డీ ఖనిజాల అభివృద్ధికీ తోడ్పడుతుందని వివరించారు. నానోపదార్థాల తయారీలో నవకల్పనలకు దారితీస్తుందన్నారు. చాలా స్వల్పస్థాయి బంగారాన్ని వినియోగించడం వల్ల పరిశ్రమల్లో ఆర్థికపరంగానూ ప్రయోజనాలు ఉంటాయని మరో పరిశోధకులు ఎవాన్స్ స్పష్టం చేశారు.
పలచని బంగారం రేకులు
Related tags :