అన్ని రంగాల్లో సమాజం ముందుకు పోతోంది. అయినా ఆమెకు రక్షణ లేదు. కామాంధుల కబంద హస్తాల్లో చిక్కుకుని ఆమె పడుతున్న వేదన అరణ్య రోదనే అవుతోంది. మన మధ్యే తిరుగుతున్న మానవ మృగాల ఆట కట్టించడానికి ఎన్నో గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు స్మార్ట్ బ్యాంగిల్స్ పేరుతో తయారు చేసిన గాజులు మహిళల భద్రతను మరింత పెంచుతాయి. ఆకతాయిల ఆగడాలను అరికడతాయి. 23 ఏళ్ల గాది హరీష్ తన స్నేహితుడు సాయి తేజాతో కలిసి ఈ గాజులను తయారు చేశాడు. ఇవి ధరించిన అమ్మాయిని గట్టిగా పట్టుకుంటే షాక్ కొడతాయి. అంతేకాకుండా.. గాజులో అమర్చిన సెక్యూరిటీ సిస్టమ్ ఆన్ అవుతుంది. పోలీసులకు, గాజుని ధరించిన ఆమె బంధువులకు వెంటనే మెసేజ్ వెళ్లిపోతుంది. ఆమె ఎక్కడ ఉందీ అన్న సమాచారం కూడా తెలుపుతాయి. జరగబోతున్న ఉపద్రవాన్ని గుర్తించగానే బాధితురాలు ఆ గాజును ఒక పక్కకు తిప్పితే చాలు.. మొత్త సమాచారం తెలిసిపోతుంది. మహిళలపై అత్యాచారాలు, హత్యలు, అపహరణలు ఎక్కువవుతున్న నేపథ్యంలో సెల్ఫ్ సెక్యూరిటీ బ్యాంగిల్ ప్రాజెక్టును ప్రారంభించామని హరీష్ వివరించాడు.
ఈ స్మార్ట్ బ్యాంగిల్ కామాంధులకు షాక్ ఇస్తుంది
Related tags :