పాస్పోర్ట్ సేవలు మరింత సులభం అయ్యాయి. తత్కాల్లో దరఖాస్తు చేసుకుంటే ఒక్క రోజులో పాస్ పోర్ట్ పొందవచ్చు. సాధారణ దరఖాస్తు దారులు 11 రోజుల్లో పాస్ పోర్ట్ పొందవచ్చు. పాస్ పోర్ట్ సేవలు సులభతరం చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్ని రూపొందించింది. దరఖాస్తు దారుల పరిశీలనలో పోలీసులకు ఇది ఉపయోగపడుతుంది. మరోవైపు పలు నకిలీ వెబ్ సైట్లు పాస్ పోర్ట్ సేవల పేరుతో ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్నాయి. అతర్జాలంలో దరఖాస్తు, స్లాట్బుకింగ్ పేరుతో భారీ ఎత్తున రుసుం వసూలు చేస్తున్నాయి. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నకిలీ వెబ్ సైట్ల పేర్లనూ విడుదల చేసింది. www.online-passportindia.com, www.indiapassport.org, www.passport-india.in, www.passportindiaportal.in, www.passport-seva.in, www.applypassport.org తదితర వెబ్సైట్లు నకిలీవని ప్రకటించింది. పాస్పోర్ట్ కోసం www.passportindia.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. మంత్రిత్వ శాఖ అధికారికంగా రూపొందించిన ఎమ్పాస్పోర్ట్ సేవ smPassport Seva యాప్ యాపిల్స్టోర్, ప్లేస్టోర్లో పొందవచ్చని తెలిపింది.
ఒక్కరోజులో పాస్పోర్ట్
Related tags :