పాకాల ఆయకట్టులోని వరి పొలాలకు ఆదివారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన రెడ్డి లాంఛనంగా పంట కాల్వలకు నీటిని ఆదివారం విడుదల చేశారు. తొలుత కట్ట మైసమ్మకు పూజలు చేశారు. తుంగబంధం, సంగ్యం తూముల నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అతి త్వరలోనే పాకాలలోకి గోదావరి జలాల తరలింపు ప్రక్రియ పూర్తవుతోందన్నారు. ప్రస్తుత నీటితో 30వేల ఎకరాలలో ఖరీఫ్ సాగవుతోందని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే పాకాల అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. తూములకు మరమ్మతులు, పంటకాల్వల ఆధునికీకరణకు సీడీపీ నిధుల నుంచి రూ.36లక్షలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రకాశ్‌రావు, జడ్పీటీసీ సభ్యురాలు స్వప్న, సర్పంచి కవిత, ఏఈఈలు గోవర్థన్, సంతోష్, నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పాకాల ఆయుకట్టుకు నీటి విడుదల
Related tags :