Food

వాక్కాయ పచ్చడి తినండి. మధుమేహాన్ని ఎగిరితన్నండి.

Vakkaya Pachchadi Helps Relieving Diabetes

పులుపూ, తీపీ కలగలిపిన వాక్కాయలు నేరుగా తిన్నా, కూరలూ రోటిపచ్చడీ చేసుకుని తీసుకున్నా ఆ రుచే వేరు. అంతేకాదు, వీటితో పోషకాలు కూడా అధికమే.
* వాక్కాయల్లో ఐరన్‌ అధికంగా లభిస్తుంది. రక్తహీనత ఉన్నవారూ గర్భిణులూ తింటే ఐరన్‌ లోపం దూరమవుతుంది. అలానే రక్తంలో వ్యర్థాలూ బయటకు వెళ్లిపోతాయి.
* వీటిలో సి-విటమిన్‌ సమృద్ధిగా దొరుకుతుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచడంతోపాటు శరీరంలో కొత్త కణజాలం వృద్ధికి తోడ్పడుతుంది. హృద్రోగాలను దూరం చేసి గుండె పనితీరును మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
* నాలుగైదు కాయల్ని నేరుగా లేదంటే ఉప్పుతో కలిపి తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. అరుగుదలా బాగుంటుంది. జీర్ణాశయం పనితీరు మెరుగవుతుంది. మధుమేహం ఉన్నవారు తింటే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు అదుపులోకి వస్తాయి.
* వాక్కాయలు దంతాలకు కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిని నమలడం వల్ల దంతాలు శుభ్రపడతాయి. చిగుళ్ల నుంచీ రక్తం కారడం తగ్గుతుంది.