DailyDose

జియో నుండి బంపర్ ఆఫర్లు-వాణిజ్య-08/12

Jio India Offers Super Deals On Internet-Today Telugu Business News-Aug122019

*రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. జియో నుంచి నాలుగు రకాల బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. సెప్టెంబర్ 5న జియో ఫైబర్‌ను ఆవిష్కరిస్తామని, జనవరి 1, 2020 నుంచి జియో ఫైబర్ పేరుతో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తాయని ముఖేష్ ప్రకటించారు.జియో హోం బ్రాడ్‌బ్యాండ్‌లో భాగంగా సెకనుకు 1జీబీ స్పీడ్‌తో 100 జీబీ ఇంటర్నెట్, ఉచిత ల్యాండ్‌లైన్ సౌకర్యం, వీడియో కాన్ఫరెన్స్, యూహెచ్‌డీ సెటాప్ బాక్స్‌ను అందించనున్నట్లు తెలిపారు. ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, డీటీహెచ్, ల్యాండ్‌లైన్ సేవలను అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు.
* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న జియో ఫైబర్‌ సేవలు సెప్టెంబరు 5 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కంపెనీ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. సోమవారం జరిగిన రిలయన్స్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్‌ మాట్లాడుతూ.. ‘సెప్టెంబరు 5 నాటికి జియో ఆవిష్కరించి మూడేళ్లు పూర్తవుతుంది. అదే రోజున జియో ఫైబర్‌ సేవలను కమర్షియల్‌ బేసిస్‌లో ప్రారంభిస్తాం’ అని తెలిపారు. 1600 నగరాల్లోని 2కోట్ల నివాసాలు, 1.5కోట్ల వ్యాపార భవనాలకు జియో ఫైబర్‌ను అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
*అమెరికా విపణిలో ప్రతికూలతల నేపథ్యంలో ఇతర దేశాల్లో వ్యాపార కార్యకలాపాల విస్తరణపై నాట్కో ఫార్మా దృష్టి పెట్టింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఔషధ విపణి అయిన చైనాలో, కేన్సర్ చికిత్సకు వినియోగించే ఔషధాల విక్రయానికి నాట్కో దరఖాస్తు చేయనుందని కంపెనీ 2018-19 వార్షిక నివేదికలో నాట్కో ఫార్మా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ నన్నపనేని తెలిపారు.
* రిలయన్స్ ఇండస్ట్రీస్ జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లో ఇకపై విమాన ఇంధనం (ఏటీఎఫ్), పెట్రో రసాయనాలు మాత్రమే ఉత్పత్తి చేయాలని నిర్ణయించిందని సమాచారం. అధిక విలువ కలిగిన ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇచ్చే వ్యూహంలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
*ఆర్థిక మందగమనం నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వివిధ రంగాల ప్రతినిధులతో వరుసగా సమావేశమై, సమస్యలు పరిష్కారాలను అన్వేషించే పనిలో ఉన్నారు. స్థిరాస్తి అభివృద్ధిదారులు, గృహ కొనుగోలుదార్ల సంఘాల ప్రతినిధులతో ఆదివారం ఆమె సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.
*ప్రభుత్వ విధానాలు రవాణా రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని, వ్యాపారం చేయడం కష్టతరంగా మారిందని ఆలిండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏఐటీడబ్ల్యూఏ), ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) పేర్కొన్నాయి. అధిక వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేటు, డీజిల్పై రూ.2 సెస్సు, బీమా మొత్తం పెరగడం, లాభాలు వస్తాయని అంచనా వేసి విధించే (ప్రిసప్టివ్) పన్ను పెంచడం వల్ల రవాణా సంస్థలపై పెనుభారం పడిందని వెల్లడించాయి.
* జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ కోసం వేదాంతా రిసోర్సెస్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) బిడ్ దాఖలు చేశారు. తన కుటుంబ పెట్టుబడి సంస్థ అయిన వోల్కన్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అనిల్ అగర్వాల్ తన ఈఓఐ దాఖలు చేశారని సమాచారం.