బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక సినిమా ‘సాహో. దేశ చరిత్రలోనే అతిపెద్ద యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ‘సాహో’ ఈ నెల 30న ప్రేక్షకులను పలుకరించబోతోంది. ప్రభాస్‌తోపాటు శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేశ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా కోసం చిత్రయూనిట్ ముమ్మరంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.ఇటీవల విడుదలైన ‘సాహో’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ‘సాహో’ చిత్ర బడ్జెట్‌పై అనేక రుమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఫిల్మ్ కంపానియన్ అనుపమ చోప్రాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్ చిత్ర బడ్జెట్‌పై స్పందించారు. రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్టు ఇంతకముందు కథనాలు వచ్చాయి. చిత్ర బడ్జెట్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ కళ్లు చెదిరే విషయాలు వెల్లడించారు. ఈ సినిమా బడ్జెట్ అక్షరాల రూ. 350 కోట్లు అని తెలిపారు. ఇక, ఇది ఫ్యూచరిస్టిక్ సినిమా కాదని స్పష్టం చేసిన ప్రభాస్.. ‘ఇది ప్రస్తుతం నడిచే కథ. సినిమాలో కొన్ని పార్ట్స్ ఫ్యూచరిస్టిక్‌గా ఉంటాయి. అవి యదార్థంగానే సాగుతాయి. ట్రైలర్‌లో నేను ఎగరడం మీరు చూస్తారు. ఈ సీన్లను మేం పెద్దస్థాయిలో తీశాం. ట్రైలర్‌లో పింక్ సరస్సు కనిపిస్తోంది. ఇది ఆస్ట్రేలియాలో ఉంది. అది కూడా నిజమైనదే. ప్రపంచం నలుమూలాల్లోని ఉత్తమమైన వాటిని ఒకచోట చేర్చి ఈ సినిమాలో చూపిస్తున్నాం’ అని ప్రభాస్ వెల్లడించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషాల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలవుతోంది. ఇక, అబుదాబిలో చిత్రీకరించిన ఓ ఛేజింగ్ సీన్ కోసం అక్షరాల రూ. 80 కోట్లు ఖర్చు పెట్టినట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.
అక్షరాలా ₹350కోట్లు
Related tags :