Movies

సుమా…ఓ పాత చింతకాయ పచ్చడి

Anchor Anasuya Criticizes Suma When Netizens Trolled Her

నిన్నగాక మొన్నే చెప్పింది అనసూయ.. అన్నిటికీ అతిగా రియాక్ట్ అవను అని. అంతలోనే ఏమైందో నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అనసూయ. ఆమె వస్త్రధారణ ఎప్పడూ టాపిక్కే. తాజాగా అనసూయ మరోసారి బుక్కయింది నెటిజన్స్ చేతిలో. చిట్టి పొట్టి బట్టలేసుకునే అనసూయను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నేను ఎలాంటి డ్రెస్‌లు వేసుకుంటే మీకెందుకు. నా డ్రెస్‌లు నా ఇష్టం అంటోంది. అంతేకాదు తోటి యాంకర్ ఎంత సభ్యతగా సంస్కారవంతమైన డ్రెస్‌లు వేస్తుందో చూసి నేర్చుకోవచ్చుగా అంటే దానికి అనసూయకు మరీ చిర్రెత్తుకొచ్చింది. ఏంటి సుమని చూసి నేర్చుకోవాలా. తనే నన్ను చూసి నేర్చుకోవచ్చుగా. ఎలా అప్‌డేట్ అవ్వాలో తెలుసుకోవచ్చుగా. ఎప్పుడూ ఆ పాత చింతకాయ పచ్చడిలా తయారవకపోతే కాస్త మోడ్రన్‌గా.. అచ్చంగా నాలా ఉండొచ్చుగా అంటూ కాస్త ఘాటుగానే కౌంటర్లిచ్చింది.అయినా సుమ, నేను, ఝాన్సీ అంతా పెళ్లయినవాళ్లమే. ఎవరి కంఫర్ట్ జోన్‌లో వాళ్లు వర్క్ చేసుకుంటున్నారు. మేమందరం చేస్తున్న పనిని ప్రేమించే వాళ్లమే. వాళ్ల అనుభవం ముందు నేను ఎప్పుడూ తక్కువే. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాను. చాలా మంది వాళ్లతో నన్ను కంపేర్ చేస్తారు. వాళ్లని చూసి నేర్చుకోమంటారు. అలా ఎందుకు ఆలోచిస్తారు. సుమ నన్ను చూసి నేర్చుకోవచ్చు కదా. కాలాన్ని బట్టి ఎలా ఉండాలో.. నాతో పాటు ఎందరో యాంకర్లు ఎలాంటి డ్రెస్‌లు వేసుకున్నా అభ్యంతరం చెప్పరు. కేవలం నన్ను మాత్రం టార్గెట్ చేస్తారు. చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. సో.. ఇంకెప్పుడూ ఇలాంటి సలహాలు చెప్పకండి అని అను గుస్సా అవుతోంది.