DailyDose

చంద్రబాబు ఇంటికి పొంచి ఉన్న ప్రమాదం-తాజావార్తలు–08/14

Chandrababu Amaravathi Home Stuck In Flood-Telugu Breaking News-Aug142019

* ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నివాసం ప్రమాదంలో పడింది. పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణా కరకట్ట ప్రమాదంలో పడింది. దీనిని ఆనుకుని నిర్మించిన అనేక నిర్మాణాల్లోకి ఇప్పటికే వరద నీరు చేరింది. చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని గెస్ట్‌హౌస్ మెట్ల వరకు నీరు చేరుకోవడంతో ఆందోళన మొదలైంది. పులిచింతల నుంచి ఆరు లక్షల క్యూసెక్కుల నీటిని వదిలితే కరకట్టపూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణా నది పొంగి ప్రవహిస్తోంది. నదీ ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండడంతో 5 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఫలితంగా కృష్ణా కరకట్ట ప్రమాదంలో పడింది.
* శత్రు సైనికుల చెరలో ఉన్నా.. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు రేపు ‘వీర్‌చక్ర’ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డును అందించనున్నారు. ఆయనతో పాటు ఐఏఎఫ్‌ స్క్వాడ్రన్‌ లీడర్‌ మింటీ అగర్వాల్‌కు యుద్ధసేవా పతకాన్ని ప్రదానం చేయనున్నారు. పలువురు జవాన్లకు శౌర్యచక్ర, కీర్తిచక్ర అవార్డులను కూడా అందించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న బాలాకోట్‌ దాడి జరిగిన మరుసటి రోజు ఫిబ్రవరి 27న పాకిస్థాన్‌ విమానాలు మన దేశంపై దాడికి ప్రయత్నించాయి. ఆ సమయంలో పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్‌-16ను అభినందన్‌ తన మిగ్‌ విమానంతో కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మిగ్‌ కూడా కూలిపోవడంతో అభినందన్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో దిగారు. అక్కడి స్థానికులు ఆయనను పట్టుకుని పాక్‌ సైనికులకు అప్పగించారు. దౌత్య ఒత్తిడితో మూడు రోజుల తర్వాత అభినందన్‌ను దాయాది దేశం విడిచిపెట్టింది.అయితే పాక్‌ సైనికులు ఎంత ఒత్తిడి చేసినా.. అభినందన్‌ మన సైన్యానికి సంబంధించిన రహస్యాలను వెల్లడించలేదు. శత్రువుల చెరలో ఉన్నప్పుడు కూడా ఎంతో ధైర్యంగా ఉన్నారు. అందుకుగానూ ఆయనను ప్రభుత్వం వీర్‌చక్రతో సత్కరించనుంది. జవాన్లకిచ్చే పరమ్‌వీర చక్ర, మహా వీరచక్ర తర్వాత మూడో అత్యున్నత పురస్కారం ఇది.
* తెలంగాణ సచివాలయం అడ్రస్‌ నేటి నుంచి అధికారికంగా మారుతోంది. ఇప్పటివరకు హుస్సేన్‌ సాగర్‌ తీరంలో సువిశాల ప్రాంగణంలో ఉన్న పాత సచివాలయం కనుమరుగు కానుంది. త్వరలోనే అక్కడ మరో పెద్ద సెక్రటేరియట్‌ ఆవిర్భవించనుంది. అప్పటివరకు బూర్గుల రామకృష్ణారావు భవన్‌ తాత్కాలిక సచివాలయంగా కొనసాగనుంది. ఇప్పటికే అక్కడ సీఎస్‌ ఛాంబర్‌ సిద్ధం కాగా… ఇతర ప్రిన్సిపల్ సెక్రెటరీల ఛాంబర్లు రెడీ అవుతున్నాయి.
* చంద్రబాబుకు రాఖీ కట్టిన సీతక్క, సునీత
హైదరాబాద్ ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి పరిటాల సునీత* రాఖీ కట్టారు.చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. చేతికి గాయం కారణంగా విశ్రాంతి కోసం చంద్రబాబు..
మంగళవారం ఉండవల్లి నుంచి హైదరాబాద్‌కు వచ్చారు.
* ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు వీరంగం సృష్టించాయి. విజయనగరం జిల్లా నుంచి వచ్చిన శ్రీకాకుళం జిల్లాలోని కోటుల గుమ్మడ గ్రామంలోకి చొరబడ్డాయి. గ్రామ పొలిమేరలో ఉన్న వరి పొలాల్లోకి దిగి..పంటను ధ్వంసం చేశాయి. వ్యవసాయం క్షేత్రాల్లో తిరిగి బీభత్సం సృష్టించాయి. గ్రామస్థులు ఏనుగులను తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగుల అడవిలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
* అధికరణ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో విధించిన ఆంక్షల్ని జమ్ము ప్రాంతంలో పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు జమ్ముకశ్మీర్‌ అదనపు డీజీపీ మునీర్‌ ఖాన్‌ తెలిపారు. కశ్మీర్‌లో మాత్రం మరికొన్ని రోజుల పాటు యథాతథ స్థితిని కొనసాగించనున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు.
* ఉగాది నాటికి పేదలకు ఇళ్ల పట్టాలు సంతృప్తికర స్థాయిలో మంజూరు చేసేలా ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అందుబాటులో ఉన్న భూమిని గుర్తించాలన్నారు.
* సెకండ్‌ హ్యాండ్ కార్ల వ్యాపారం చేసే కార్స్‌ 24డాట్‌ కామ్‌ లో క్రికెటర్‌ మహీంద్ర సింగ్‌ ధోనీ ఇన్వెస్ట్ చేశారు. బ్రాండ్‌ అంబాసిడర్‌ గానూ ఆయనను కంపెనీ నియమించుకుంది. ఆయన ఇన్వెస్ట్‌‌మెంట్‌ ‘సిరీస్‌ డి’ రౌండ్‌ ఫండింగ్‌ లో భాగమని కార్స్‌ 24 సహ వ్యవస్థాపకుడు, సీ ఈఓ విక్రమ్‌ చోప్రా తెలిపారు. ధోనీ ఎందరో ఇండియన్లకు ఆదర్శమని అన్నారు.
* ధాని ఢిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్‌లో విషాదం నెలకొంది. ఫరీదాబాద్‌ డీసీపీ(డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు)గా సేవలందిస్తున్న విక్రమ్‌ కపూర్‌ తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సొంతింట్లో ఇవాళ ఉదయం 6 గంటలకు విక్రమ్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. విక్రమ్‌ నిజాయితీగల పోలీసు ఆఫీసర్‌ అని సహచరులు పేర్కొన్నారు. విక్రమ్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
*కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి శివారులో ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తుండగా.. మూలమలుపు వద్ద బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు ఓ వైపు ఒరిగిపోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
*చారిత్రాత్మక గోల్కొండ కోటలో వరుసగా ఆరో సంవత్సరం పంద్రాగస్టు వేడుకలు జరుగనున్నాయి. దీనికోసం కోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నాలుగు రోజులుగా జెండావందనం కోసం పోలీస్ బలగాలు పరేడ్ రిహార్సల్స్ను చేశారు. అంతేకా కుండా సీఎం కాన్వాయ్ రిహార్సల్స్ మంగళవారం నిర్వహించారు. గోల్కొండ కోటలో అన్నీ శాఖల అధికారులతో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్రెడ్డి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించి అందరికీ బాధ్యతలను అప్పగించారు.
*భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు దేవాలయం లాంటి పార్లమెంటు భవనం స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో కొత్త వెలుగులతో భాసిల్లుతోంది. ఈ మేరకు నూతనంగా ఏర్పాటుచేసిన అత్యాధునిక విద్యుత్తు దీపాల వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రాత్రి లాంఛనంగా ప్రారంభించారు.
*జమ్మూ-కశ్మీర్లో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు శ్రీనగర్లో అక్టోబర్-12 నుంచి మూడు రోజులపాటు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్నట్లు అధికార యంత్రాంగం మంగళవారం ప్రకటించింది. జమ్మూ-కశ్మీర్లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, వనరులు, మౌలిక వసతులు వంటివాటిని ఈ సదస్సుకు వచ్చిన పెట్టుబడిదారులకు వివరిస్తామని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి (పరిశ్రమలు) నవీన్ చౌధురి తెలిపారు.
*రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పందించారు. వాస్తవ నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి నివేదిక కోరుతూ కేంద్ర హోం శాఖ ఈ నెల 7న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి లేఖ రాసింది.
*అధిక వర్షాలతో యూరియా వినియోగం గణనీయంగా పెరిగింది. ఇదే అదనుగా ధర పెంచి వ్యాపారులు రైతులను దోచేస్తున్నారు. మార్కెట్లో విక్రయించే 45 కిలోల యూరియా బస్తా గరిష్ఠ చిల్లర అమ్మకం ధర(ఎమ్మార్పీ) రూ.266.50. పలు ప్రాంతాల్లో రశీదుపై రూ.266 రాసి రైతుల నుంచి రూ.320కి పైనే తీసుకుంటున్నారు.
*అధిక వర్షాలతో యూరియా వినియోగం గణనీయంగా పెరిగింది. ఇదే అదనుగా ధర పెంచి వ్యాపారులు రైతులను దోచేస్తున్నారు. మార్కెట్లో విక్రయించే 45 కిలోల యూరియా బస్తా గరిష్ఠ చిల్లర అమ్మకం ధర(ఎమ్మార్పీ) రూ.266.50. పలు ప్రాంతాల్లో రశీదుపై రూ.266 రాసి రైతుల నుంచి రూ.320కి పైనే తీసుకుంటున్నారు.
*ప్రతిష్ఠాత్మక సీఏ తుది పరీక్షల్లో (పాత సిలబస్) హైదరాబాద్కు చెందిన వీపీ రాధాలక్ష్మి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. మొత్తం 800 మార్కులకు 633 మార్కులు సాధించారు. మే, జూన్ నెలల్లో జరిగిన సీఏ ఫైనల్ (పాత, కొత్త సిలబస్)తోపాటు సీఏ ఫౌండేషన్ పరీక్షల ఫలితాలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) మంగళవారం విడుదల చేసింది.
* పోలవరం ప్రాజెక్టు టెండర్ని రద్దు చేసి మళ్లీ పిలవడం (రీ టెండరింగ్) వల్ల నష్టమే తప్ప, లాభమేమీ ఉండబోదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పేర్కొంది. రీ టెండరింగ్కు వెళ్లడం వల్ల నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు, ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటు చేసుకుంటుందని, నిర్మాణ గడువు పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేసింది.
*హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో విధులు నిర్వహిస్తున్న సహాయ పోలీస్ కమిషనర్లు ఎస్.మోహన్కుమార్, ఏవీఆర్ నరసింహారావులకు కేంద్ర హోంశాఖ అందించే ‘ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్-2019’ పతకాలు దక్కాయి.
*పోలవరం ప్రాజెక్టు టెండర్ని రద్దు చేసి మళ్లీ పిలవడం (రీ టెండరింగ్) వల్ల నష్టమే తప్ప, లాభమేమీ ఉండబోదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పేర్కొంది. రీ టెండరింగ్కు వెళ్లడం వల్ల నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు, ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటు చేసుకుంటుందని, నిర్మాణ గడువు పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేసింది.
*మానవ హక్కుల కోర్టుల ఏర్పాటుకు తీసుకున్న చర్యల వివరాలను అందచేయని తెలంగాణ సహా 7రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం జరిమానా విధించింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు రూ.లక్ష చొప్పున తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, మేఘాలయ, మిజోరంలు రూ.50వేలు చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
*ఎంసెట్ బైపీసీ విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మాడి, బీటెక్ బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి ఈనెల 17వ తేదీ నుంచి చివరి విడత కౌన్సెలింగ్ జరగనుంది. ఈనెల 17, 18న ప్రాథమిక సమాచారం భర్తీ, 19న ధ్రువపత్రాల పరిశీలన, 17-20వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు, 21న సీట్ల కేటాయింపు జరుగుతుందని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు.
*ఎంసెట్ బైపీసీ విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మాడి, బీటెక్ బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి ఈనెల 17వ తేదీ నుంచి చివరి విడత కౌన్సెలింగ్ జరగనుంది. ఈనెల 17, 18న ప్రాథమిక సమాచారం భర్తీ, 19న ధ్రువపత్రాల పరిశీలన, 17-20వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు, 21న సీట్ల కేటాయింపు జరుగుతుందని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు.
*సీనియర్ ఐఏఎస్ అధికారిణి, తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల శాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్లో డిప్యుటేషన్పై పనిచేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఆమెను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1988 బ్యాచ్కి చెందిన ఆమె డిప్యుటేషన్పై ఏపీకి వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనిని పరిశీలించిన అనంతరం కేంద్రం తాజాగా అంగీకారం తెలిపింది. శ్రీలక్ష్మికి 2026వ సంవత్సరం వరకు సర్వీసు ఉంది.
*ఆంధ్రప్రదేశ్కు పూర్తిస్థాయి డీజీపీగా గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు. ఈయన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఇన్ఛార్జి డీజీపీగా ఉన్న ఆయనను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
*భారతీయ జ్ఞాన్పీఠ్ తెలుగు భాషా సలహా సంఘం కన్వీనర్గా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ చందు సుబ్బారావు నియమితులయ్యారు. రానున్న మూడేళ్లలో జ్ఞాన్పీఠ్, మూర్తి దేవి పురస్కారాలకు అర్హులను ఎంపిక చేసేందుకు జ్ఞాన్పీఠ్ సంస్థ భాషల వారీగా సలహా సంఘాలను నియమించింది. తెలుగు భాషా సలహా సంఘంలో సభ్యులుగా సీనియర్ పాత్రికేయుడు, ఎ.కృష్ణారావు, రచయిత వెన్నా వల్లభరావు నియమితులయ్యారు.
*పంచాయతీ కార్యదర్శి పోస్టుల ప్రధాన రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్టిక్కెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది. ఈ నెల 26న ఈ పరీక్షను నిర్వహించనుంది.