మనది పుణ్య భూమి. మన చరిత్ర చాలా పురాతన మైనది. త్రేతాయుగంలో రామాయణం జరిగింది. ద్వాపర యుగంలో మహా భారతం జరిగింది. వీటన్నిటికీ చాలా ఆధారాలు ఈ కలియుగంలో దొరికాయి. భారత దేశాన్ని ఎందరో మహారాజులు పరిపాలించారు. వారందరిలో దేశాన్ని స్వర్ణ యుగంలా మార్చింది గుప్త రాజుల కాలంలోనే. వారిది మౌర్య వంశం. మౌర్య వంశ స్దాపకుడు మౌర్య చంద్ర గుప్తుడు. క్రీ.పు. 322లో ధన నందనుని సంహరించి , ప్రధానమంత్రి అయిన కౌటిల్యుడి సహాయంతో మగధను ఆక్రమించాడు.
చంద్ర గుప్త మౌర్యుడు షుమారు 25 సంవత్యరములు యావత్ భారత్ దేశాన్ని సురక్షితంగా పరిపాలించాడు. ఆయన కాలంలోనే, కౌటిల్యుడు అర్ద శాస్త్రాన్ని సంస్కృతంలో రచించాడు. అందు నూట యాభై అద్యాయాలను, ఆరువేల శ్లోకాలను పొందుపరిచాడు.
“యధారాజా తధా ప్రజా” అనే నానుడి అతని కావ్యంనుండే వచ్చింది.
ఈయన తదుపరి కాలంలో జైన మతాన్ని , ఆయన గురువైనటువంటి భద్రబాహువు ద్వారా స్వీకరించాడు.
మౌర్య చంద్ర గుప్తుడు కర్ణాటకలోని శ్రావణబెళగోల లో మరణించాడు.
ఆతరువాత వచ్చిన రాజులలో అశోకుడు చాలా గొప్పవాడు. అశోకుడు క్రీ.పూ. మూడువందల నాలుగులో జన్మించాడు. అశోకుడి తండ్రి బిందుసారుడు. ఈయన షుమారు ముప్పై ఎనిమిది సంవత్యరములు పరిపాలించాడు. తమిళనాడు, అస్సాంతప్ప మిగిలిన భారత దేశ మొత్తాన్ని తన ఆధీనంలో వుంచుకున్నాడు.
క్రీ.పూ. 261 లో కళింగ యుద్దము జరిగింది.
అశోకుడిలో కళింగ యుద్దము తరువాత గొప్ప మార్పు వచ్చి ఉపగుప్దడి ప్రేరణతో బౌద్దమతం స్వీకరించాడు. ఆతర్వాత ఆయనలో చాలా మార్పులు వచ్చాయి. ఆయనకాలంలోనే సాంచీ, సారనాద్, చార్యుత్ స్తూపాలను నిర్మించాడు. జంతు బలులను, మాంసమును సేవించుట నిషేధించాడు. లుంబిని, గయ, సారనాధ్ బౌద్దమత క్షేత్రాలను దర్శించాడు.
ధర్మము ద్వారా, దేశ సమైక్యత, సమగ్రత, ప్రగతిని సాధించేందుకు కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టాడు.
క్రీ.పూ. 232 లో అశోకుడు మరణించాడు.
పిల్లలూ మీకో విషయం తెలుసా? భారత దేశపు రాజముద్ర సారనాధ్ స్తూపము నుండే గ్రహించబడినదని..
నీతి: దేశ ప్రగతి దేశ సమైక్యత వల్లనే జరుగుతుంది.