మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘మహా సముద్రం’. ‘ఆర్ ఎక్స్ 100’తో తొలి అడుగులోనే విజయాన్ని అందుకున్న అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన అదితిరావు హైదరీని ఎంచుకున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపించాయి. తాజాగా రవితేజకు జోడీగా రాశీఖన్నా నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. అదితికి వేరే ప్రాజెక్టులు ఉండటంతో డేట్స్ కుదరక ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాశీ గతంలో రవితేజ సరసన బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ‘డిస్కోరాజా’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు రవితేజ.
రవిఖన్నా
Related tags :