Politics

దేవుడిని మెచ్చుకున్న చంద్రబాబు

Chandrababu praises the lord for lighting up amaravathi

దేవుడు స్ర్కిప్ట్‌ భలే రాశాడని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరోక్షంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆయన ట్వీట్‌ చేశారు. ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్‌, భ్రమరావతి అంటూ అబద్ధాలు చెప్పారో వాళ్ల చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్‌ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం తాజాగా సచివాలయానికి అమర్చిన విద్యుద్దీపాల అలకంరణ ఫోటోలను చంద్రబాబు తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.