ఇంట్లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగలను వృద్ధదంపతులు తరిమి కొట్టిన విషయం తెలిసిందే. ప్రాణాలకు తెగించి ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించిన వృద్ధ దంపతులకు సాహస పురస్కారం లభించింది. షణ్ముగవేల్, శంతమరై దంపతులకు తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రత్యేక సాహస పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రభుత్వం నుంచి సాహస పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉంది. మా ఫిర్యాదుపై పోలీసులు వేగంగా స్పందించారు. మేం చేసిన పని ఎంతోమంది యువతకు స్పూర్తిదాయకంగా నిలుస్తుందని భావిస్తున్నట్లు 70 ఏళ్ల షణ్ముగవేల్ తెలిపారు. ఆగస్టు 12న తమిళనాడులోని తిరునళ్వేలిలో షణ్ముగవేల్ ఇంటి బయట వరండాలో కూర్చుండగా…ఇద్దరు దుండగులు మాస్క్ లు వేసుకుని కత్తులతో అక్కడికి వచ్చారు. షణ్ముగవేల్ ఆయన భార్య శంతమరై కలిసి ఇద్దరు దొంగలపై దాడి చేసి పరుగులు పెట్టించారు.
భారత వీర దంపతులకు తమిళనాడు ప్రభుత్వం బహుమతి
Related tags :