Movies

అవన్నీ ఉత్తి పుకార్లు

Prabhas says news about him and anushka are baseless gossips

టాలీవుడ్‌ ఆన్‌ స్క్రీన్‌ పాపులర్ జోడీ ప్రభాస్‌, అనుష్క ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌లో తెగ ప్రచారం జరుగుతోంది. త్వరలో వీరి పెళ్లి జరగబోతోందని, ఇల్లు కూడా కొనడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు రాశారు. ఈ వదంతులపై ప్రభాస్‌ను తాజాగా ఓ ఆంగ్ల మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. అనుష్క తనకు మంచి స్నేహితురాలని సమాధానం ఇచ్చారు. ‘మేమిద్దరం మంచి స్నేహితులం. మా మధ్య దీనికి మించిన బంధం మరేదైనా ఉండుంటే పరిస్థితులు వేరేలా ఉండేవి. గత రెండేళ్లలో నేను, అనుష్క జంటగా ఎప్పుడైనా, ఎవరికైనా కనిపించి ఉండాలి కదా?. అనుష్క గురించి కరణ్‌ జోహార్‌ షోలో కూడా నన్ను అడిగారు. దానికి రానా, రాజమౌళి సమాధానం చెప్పారు. మా మధ్య అలాంటిదేమీ లేదని చెప్పారు. నేను వారితో ఆ మాటలు చెప్పించలేదు.. వారే స్వయంగా అన్నారు’ అని ప్రభాస్‌ పేర్కొన్నారు. ప్రభాస్‌, అనుష్క కలిసి ‘బిల్లా’, ‘మిర్చి’, ‘‘బాహుబలి’, ‘బాహుబలి 2’ సినిమాల్లో నటించారు. వీరిద్దరి జంటకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఉంది. ఇలా జోడీగా పలు చిత్రాల్లో నటించడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. ‘బాహుబలి’ సినిమా తర్వాత బాలీవుడ్‌లో వీరి ప్రేమ గురించి తెగ ప్రచారం చేస్తున్నారు.