Movies

ఒకటికి పదిసార్లు

I think twice before saying something on screen

‘‘ఓ విషయాన్ని ఎవరు చెబుతున్నారు? ఏ మాధ్యమం ద్వారా చెబుతున్నారు? అనేది చాలా ముఖ్యం. మా కళాకారులకు సినిమా కంటే గొప్ప మాధ్యమం లేదు. ఏం చెప్పాలనుకున్నా, సినిమానే సాధనంగా వాడుకోవాలి’’ అంటోంది రకుల్ప్రీత్ సింగ్. ఈమధ్యే ‘మన్మథుడు 2’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం ‘ఇండియన్ 2’లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. రకుల్ మాట్లాడుతూ ‘‘మేం ఏ విషయం చెప్పినా జనాలకు క్షణాల్లో చేరిపోతుంది. అలాంటప్పుడు ప్రతి మాటనీ ఆచి తూచి వాడాలి. సినిమాల ద్వారా ఎంచుకునే కథలు, పాత్రలు కూడా ప్రభావితం చేస్తుంటాయి. ఓ మంచి మాట చెప్పాలి, సందేశం ఇవ్వాలి అనుకున్నప్పుడు సినిమానే అత్యుత్తమ మార్గం. మేం ఎంచుకునే కథల ద్వారానే ప్రేక్షకుల్ని చైతన్యవంతులం చేయొచ్చు. అందుకే తెరపై ఎలాంటి మాట మాట్లాడాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తా’’ అని చెప్పింది.