పశ్చిమగోదావరి జిల్లాలో భారీ స్కామ్ వెలుగు చూడనుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకగా 370 కోట్ల కుంభకోణం బద్దలు కానుంది.
భీమవరం కేంద్రంగా కొందరు సాగించిన స్కామ్ తాలూకు నిజాలు వెలుగు చూడనున్న నేపథ్యంలో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఈ స్కామ్‌లో తెలివిగా వ్యవహరించిన కొందరు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టే ప్రయత్నం చేశారు.
నకిలీ పత్రాలతో ప్రైవేట్ బ్యాంకులకు కొందరు వ్యక్తులు కుచ్చుటోపి పెట్టే ప్రయత్నం చేసినట్లు వార్తలొస్తున్నాయి.
దాదాపు 370 కోట్ల రూపాయల మేర రుణాలు తీసుకుని తిరిగి చెల్లించే క్రమంలో వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే పెద్దమొత్తంలో రుణాలు తీసుకుని ఉండటంతో సీబీఐ అధికారులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.