జూనియర్ ఎన్టీఆర్ తో చంద్రబాబు మంతనాలు!
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నందమూరి హరికృష్ణ నివాసానికి వచ్చిన చంద్రబాబు నాయుడు..
చిత్రపటానికి పూలు చల్లి నివాళి అర్పించారు. శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం ఆయన హరికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు.. జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడటం కనిపించింది.
ఓ పక్కగా తీసుకెళ్లి.. కొద్దిసేపు ఏకాంతంగా జూనియర్ ఎన్టీఆర్ తో మంతనాలు సాగించారు.
కొద్దిసేపటి తరువాత కళ్యాణ్ రామ్ కూడా వారితో కలిశారు.