ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఎక్మో, ఐఏబీపీ సాయంతో వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గుండె, మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీని ఈనెల 9న ఎయిమ్స్‌లో చేర్పించారు. నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. కాసేపట్లో ఆయనకు డయాలసిస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులు జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు.
అత్యంత విషమంగా జైట్లీ ఆరోగ్యం
Related tags :