Food

పురుషుల లైంగిక ఆరోగ్యానికి మిరియాలు

Black Pepper Helps Sexual Health In Males-పురుషుల లైంగిక ఆరోగ్యానికి మిరియాలు

మిరియాలను వంటల్లో రుచికే ఎక్కువగా వాడతాం. అయితే వీటిని ఈ వర్షాకాంలో ఎక్కువగా వేధించే జలుబు, దగ్గుకు మందుగా ఉపయోగించొచ్చు కూడా. ఘాటులోనే కాదు ఔషధ గుణాల్లోను మేటి అయిన మిరియాల వల్ల బోలెడు ఆరోగ్య లాభాలున్నాయి.
**అవేంటో చూద్దాం..
1. మిరియాల్లో మెగ్నీషియం, విటమిన్ కె, ఫైబర్ మోతాదు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు వీటిలోని పైపెరిన్ అనే అత్యవసర నూనె వల్ల కండరాల నొప్పి తగ్గుతుంది.
2. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువున్నాయి.
3. ఇవి జీర్ణ రసాలు, జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్‌ల విడుదలను పెంచి, జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేసేలా చేస్తాయి.
4. మిరియాల్లోని పైపెరిన్, సెలీనియం, కర్‌క్యుమిన్, బీటా-కెరోటిన్, పైపెరిన్, విటమిన్ బి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, పెద్దపేగు కేన్సర్‌తో పాటు పలు రకాల కేన్సర్లను నివారిస్తాయి.
5. మిరియాలు శ్వాసక్రియలో అవాంతరాలను అడ్డుకొని కోరింత దగ్గు నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. అంతేకాదు ఆస్తమా లక్షణాలను నివారిస్తాయి కూడా.
6. టీ స్పూను మిరియాల పొడిని, రెండు స్పూన్ల తేనెతో కలిపి తీసుకుంటే ముక్కుదిబ్బడ సమస్య తగ్గుతుంది.
7. వీటిలోని యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు ఫ్రీరాడికల్స్‌ను బయటకు పంపి, రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేస్తాయి. రక్తంలో చక్కెర నిల్వలు తగ్గించి, రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచుతాయి.
8. ఈ సుగంధ ద్రవ్యంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చిగుళ్ల వాపును తగ్గిస్తాయి.
9. మిరియాల పొడి, లవంగం నూనె మిశ్రమం పంటి నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
10. దీనిలోని పైపెరిన్ డోపమైన్ హార్మోన్ విడుదలను ప్రేరేపించి, పార్కిన్‌సన్స్ వ్యాధిని అరికడుతుంది. నాడీ కణాలను ఉత్తేజితం చేసి, అల్జీమర్స్ ముప్పు నుంచి కాపాడుతుంది.
11. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మం మీది ముడతలు, నల్లమచ్చలు, గీతలను తగ్గిస్తాయి. సగం టీస్పూన్ నల్ల మిరియాల పొడి, టీస్పూన్ పెరుగు మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మలినాలు, మృతకణాలు తొలగిపోతాయి.
12. మిరియాలు టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి, పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి.