*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని ఫర్నిచర్ కంప్యూటర్లు మాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద పై వైకాప అధికార ప్రతినిద్జి ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శల వర్షం కురిపించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవరం అంబటి మీడియాతోమాట్లాడుతూ అసెంబ్లీని దేవాలయంగా భావిస్తా.. అక్కడ పూజారిగా మాత్రమే ఉన్నానంటున్న కోడెల చివరికి చిప్పలను కూడా ఎత్తుకుపోయారు., తన కుమారుడు, కుమార్తెను కోడెల చివరికి కొబ్బరి చిప్పలను కూడా ఎత్తుకుపోయారు. తన కుమారుడు, కుమార్తెను పూజారులుగా నియమించారు. వస్తువుల్ని దొంగలించి దొరికిపోయిన తరువాత వాటిని తిరిగి ఎచ్చేస్తున్నమంటున్నారు. కోడెల కుమారుడు, కుమార్తె ఇప్పటికే రాష్ట్రం విడిచి పారిపోయారని వార్తలోచ్చాయని పేర్కొన్నారు.
* ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి నివేదిక కోరినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆరోపించారు. ఇంటర్ బోర్డు తప్పిదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న అనామిక సోదరి ఉదయశ్రీ చదువుతున్న ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ కళాశాలకు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజసింగ్ వెళ్లారు. ఈ క్రమంలో ఉదయశ్రీ కళాశాల ఫీజును మాఫీ చేయాలని యాజమాన్యాన్ని లక్ష్మణ్ కోరారు. దీనికి కళాశాల యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని ఆయన తెలిపారు. ఉదయశ్రీ పుస్తకాల ఖర్చులు బీజేపీ తరపున అందిస్తామని లక్ష్మణ్ హామీ ఇచ్చారు. అనంతరం కళాశాలలోనే 15వేల చెక్కును ఉదయశ్రీకి అందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్రిస్తుందని, దీనికితోడు ఇతర పార్టీలపై ఎదురుదాడికి దిగుతుందని ఆయన విమర్శించారు. ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందని, వెంటనే రాష్ట్రపతికి నివేదిక పంపించాలని డిమాండ్ చేశారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మణుగూరు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టు దళ సభ్యుడు గుంటూరు రవి అనే మావోయిస్టు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు.
* ఆ విషయం స్వయంగా కేసీఆరే ఒప్పుకున్నారు: జీవన్‌రెడ్డి
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని కలెక్టర్ల సదస్సులో స్వయంగా సీఎం కేసీఆరే ఒప్పుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తన పాలన అవినీతిమయమైందని గుర్తించారన్నారు. సీఎం వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నందుకు జీవన్‌రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. అవినీతికి ద్వారాలు తెరవడం మినహా కేసీఆర్ సాధించిందేమిటని ఆయన ప్రశ్నించారు. అవినీతిని తగ్గించేందుకు కొత్త రెవెన్యూ పాలసీ అంటున్నారంటే… ఇప్పటివరకు అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్లే కదా? అని ఆయన అన్నారు. రెవెన్యూ అధికారులను కట్టడి చేయాల్సింది కలెక్టర్లు కాదా?, కలెక్టర్లలను అదుపు చేయాల్సింది సీఎం కాదా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.
*బీజేపీ చీఫ్ అమిత్ షాను చూసి చంద్రబాబు వణికిపోతున్నారు!: వైసీపీ నేత విజయసాయిరెడ్డి
నేతలు పార్టీని వీడుతున్నా కిక్కురమనడం లేదుఅవినీతి కేసులు తిరగదోడుతారని భయం పట్టుకుందిట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేతతెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలంతా పోలోమని బీజేపీలో చేరుతున్నా కిక్కురుమనలేని పరిస్థితి చంద్రబాబుదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షాకు కోపం వస్తుందేమోనని చంద్రబాబు వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు.అందుకే పార్టీ వదిలివెళుతున్న వారిని కనీసం నిలువరించే ప్రయత్నం కూడా చేయడం లేదని వ్యాఖ్యానించారు. అవినీతి కేసులు తిరగదోడుతారన్న భయంతోనే చంద్రబాబు సైలెంట్ అయిపోయినట్లు ఉన్నారని విమర్శించారు.
*రాజధాని తరలింపు ఆషా మాషీ కాదు : ఆనంద్ బాబు
మరావతి రాజధాని తరలింపు ఆషా మాషీ కాదని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ. …ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రకటన చేశాక స్పందిస్తామన్నారు. 13 జిల్లాలకు అందుబాటులో ఉంటుందని అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశామన్నారు.
*అసెంబ్లీ నాకు దేవాలయం వంటిది: కోడెల
అసెంబ్లి తనకు దేవాలయం వంటిదని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్లు తాను పూజారిలా పని చేశానన్నారు. అసెంబ్లిస ఫర్నీచర్ తరలింపుపై నిన్నే వివరణ ఇచ్చానన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే అసెంబ్లి అధికారులకు లేఖరాశానన్నారు. ఫర్నీచర్ తీసుకెళ్లండిౌ లేదంటే డబ్బులు తీసుకెళ్లండని చెప్పానన్నారు. కొత్త అసెంబ్లికి ఫర్నీచర్ సీఆర్డీయే సమకూర్చిందన్నారు.
*జగన్ పరిపాలన పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి ప్రత్తిపాటి
రాష్ట్రంలో అవినీతి లేని పాలన చేస్తాను అని అంటే ఏమో అనుకున్నాము .. కానీ చేసేది అవినీతి అమరావతిని బ్రమరావతి అన్నారు రాజధాని మారుద్దామని నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు అలా చేస్తే ఊరుకోం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాం కేంద్రప్రభుత్వం శంకుస్థాపన చేసింది అమరావతికి మీరు ఎలా మారుస్తారు ఆలోచన ఉంది మీకు లక్షల మంది ప్రజలను రోడ్లు పాలు చేద్దామనుకుంటున్నారు వరదలు వస్తాయి ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే అమెరికా వెళ్లి ఎంజాయ్ చేసిన ఈ ముఖ్యమంత్రి నా ప్రజల పాలన చేసేది ప్రజలకి పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్ లో మూసేశారు చంద్రబాబు ఇల్లు ఉంచాలని చూసి ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడేశారు కనీసం వాళ్లు ఎంత బాధలో ఎన్ని కష్టాల్లో ఉన్నారు కూడా చూడకుండా మీ మంత్రులు వారి దగ్గరికి వెళ్లి వాటర్ బాటిల్ అడిగారు ఉన్నాయా అనే అడుగుతున్నారు అంట ఎంత దౌర్భాగ్యం ఇది రాక్షస పాలన లాగా ఉంది ప్రజల పాలన లా లేదు అని వివరించి వైసిపి ప్రభుత్వం మీద జగన్మోహన్రెడ్డి పాలనపై పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు.
*చిదంబరం మెడపై అరెస్టు కత్తి!
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి మంగళవారం న్యాయస్థానాల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసుల్లో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీనిపై ఆయన వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడా ఆయనకు ఉపశమనం లభించలేదు. ఆయన పిటిషన్‌పై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం సుముఖత చూపలేదు. బుధవారం ఉదయం దీన్ని దాఖలు చేయాలని సూచించింది. తాజా పరిణామాల నేపథ్యంలో చిదంబరానికి అరెస్టు ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం ఆయన ఆచూకీ దొరకడంలేదని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి.
*శాంతి స్థాపనకు రాజీవ్ పరితపించారు
దేశంలో శాంతి స్థాపనకు రాజీవ్‌గాంధీ పరితపించారని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ అన్నారు. దేశ స్వాతంత్య్ర సముపార్జనకు, దేశాభివృద్ధికి గాంధీ, నెహ్రూ కుటుంబాలు చేసిన ప్రాణ త్యాగాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీపీసీసీ ఆధ్వర్యంలో భారతరత్న, దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 75వ జయంతి వేడుకలు మంగళవారం గాంధీభవన్‌లోని ప్రకాశంహాలులో నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ గవర్నర్ రోశయ్య, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్, పీసీసీ మాజీ అధ్యక్షులు వీహెచ్, పొన్నాల, మాజీ మంత్రులు జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, షబ్బీర్‌అలీ, డీకే సమరసింహారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు కుసుమకుమార్, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, సలీం అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్, సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి హాజరయ్యారు.
*భాజపాలోకి దేవేందర్‌గౌడ్?
తర పార్టీల నేతలను చేర్చుకునేందుకు భాజపా సంప్రదింపులు ముమ్మరం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో దేవేందర్‌గౌడ్ ఇంటికెళ్లి సమావేశమయ్యారు. దేవేందర్తోపాటు ఆయన కుమారుడు వీరేందర్‌గౌడ్‌ను పార్టీలోకి లక్ష్మణ్ ఆహ్వానించగా వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. వీరేందర్‌గౌడ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీచేసిన విషయం తెలిసిందే. వారు పార్టీలో చేరడం దాదాపు ఖాయమేనని.. మూడు, నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుందని భాజపా నేత ఒకరు పేర్కొన్నారు
*కమలం కొత్త దళం 12 లక్షలు!
భాజపాలో కొత్త సభ్యత్వాల నమోదు కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. 19వ తేదీ వరకు తెలంగాణవ్యాప్తంగా కొత్త సభ్యత్వాల సంఖ్య 12 లక్షలకు చేరినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ నియోజకవర్గాలవారీగా.. ఒక్కోటి లక్షకుపైగా సభ్యత్వాలతో కరీంనగర్, ఆదిలాబాద్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. తర్వాత స్థానాల్లో నిజామాబాద్, మహబూబ్‌నగర్ ఉండగా..ఖమ్మం, మహబూబాబాద్ చివరి స్థానాల్లో నిలిచాయి. తెలంగాణపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర పార్టీ నిర్ణయించిన 12 లక్షల కొత్త సభ్యత్వాల లక్ష్యాన్ని 18 లక్షలకు పెంచారు. ఆగస్టు 20తో సభ్యత్వ నమోదు పూర్తికావడంతో 21-30వరకు క్రియాశీల సభ్యత్వ నమోదు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది.
*తెరాసనే అబద్ధాల పుట్ట-కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ
తెరాసనే అబద్ధాల పుట్ట అని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డాపై చేసిన విమర్శలకు స్పందనగా కేటీఆర్‌కు దత్తాత్రేయ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల్లో అనేక హామీలిచ్చి.. ఒక్కటీ నెరవేర్చకుండా అబద్ధాలకు మారుపేరుగా మారింది మీ పార్టీ, ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎవరో తెలియని మీ రాజకీయ అజ్ఞానానికి ధన్యవాదాలని లేఖలో పేర్కొన్నారు. ‘‘2016లో తెలంగాణకు ఎయిమ్స్ కావాలని, కేంద్ర ఫార్మా ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని నాడు నువ్వు (కేటీఆర్) కలిసిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా.
*నల్లమల వెళ్లేందుకు అనుమతించండి: కోదండరాం
యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వారికి మద్దతు ఇచ్చేందుకు నల్లమలకు వెళుతున్న తమను పదేపదే పోలీసులు అడ్డుకుంటున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం ఆరోపించారు. ఆ ప్రాంతానికి తమను వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న కార్యక్రమాలను అడ్డుకోకుండా చూడాలని వినతిపత్రంలో ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాలకు సొంత భవనాలు నిర్మించాలని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెజస విద్యార్థి విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.
*ఆజాద్‌ను విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులామ్ నబీ ఆజాద్‌ను జమ్మూ-కశ్మిర్లో పర్యటించనివ్వకుండా పోలీసులు మంగళవారం జమ్మూ విమానాశ్రయంలోనే ఆపివేశారు. అక్కడి నుంచే దిల్లీకి మరో విమానంలో వెనక్కి పంపారు. దిల్లీ నుంచి బయలు దేరిన ఆయన మధ్యాహ్నం 2.45గంటలకు జమ్మూ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనను బయటకి వెళ్లకుండా అడ్డుకొని 4గంటలకు దిల్లీ పంపించి వేశారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవీందర్ శర్మ తెలిపారు.
*నిరూపించండి లేదా క్షమాపణ చెప్పండి
రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న భాజపా రాష్ట్ర నేతలు.. దమ్ముంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించి వాటిని నిరూపించాలని, లేనిపక్షంలో క్షమాపణలు చెప్పాలని తెరాస ఎమ్మెల్సీలు టి.భానుప్రసాద్‌రావు, వి.గంగాధర్‌గౌడ్, శంబీపూర్ రాజులు డిమాండ్ చేశారు. తెరాసతో తలపడే శక్తి లేక.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతర నేతలు నైతిక విలువలు కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. మంగళవారం వీరు తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ఉద్దేశించిన లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన కుసంస్కారాన్ని బయటపెట్టాయి.
*కోడెల బాగోతాలు త్వరలోనే వెలుగులోకి-మంత్రి కన్నబాబు వ్యాఖ్య
హైదరాబాద్‌లో పాత అసెంబ్లీకి చెందిన 4 లారీల ఫర్నిచరును పట్టుకుపోయిన మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు.. దొరికిపోయాక వెనక్కి ఇస్తానంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. సాధారణ వ్యక్తి ఇలా చేస్తే దొంగతనమో, దోపిడీయో అంటారని విమర్శించారు. ఆయన చేసింది తప్పో కాదో తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. సచివాలయంలో మంగళవారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఎందుకు ఓడామో తెలియడం లేదనే చంద్రబాబు ఇలాంటివన్నీ తెలుసుకోవాలని సూచించారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రస్తుత సభాపతి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
*అమరావతిపై దుష్ప్రచారం: అనగాని
రాజధాని అమరావతిపై వైకాపా నేతలు బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి దుష్ప్రచారం చేస్తూ రైతుల త్యాగాలను అవమానిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. అమరావతిని నిర్మిస్తే కాలువలు, డ్యాంల ఏర్పాటుకే అధిక వ్యయం అవుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కోడెల కొబ్బరి చిప్పను కూడా వదలలేదు-రాజకీయ–08/21
Related tags :