అంతరిక్ష కేంద్రం నుంచి తన మాజీ భర్త బ్యాంకు ఖాతాను యాక్సెస్ చేసిన ఆరోపణలపై ఓ వ్యోమగామిపై నాసా విచారణ జరుపుతోందని సమాచారం. అంతరిక్షంలో చేసిన నేరానికి భూమ్మీద విచారణ చేపట్టిన మొదట సంఘటన బహుశా ఇదే కావొచ్చు! అన్ మెక్క్లెయిన్ నాసాలో వ్యోమగామి. అంతరిక్ష కేంద్రంలో కొన్నాళ్లు పరిశోధన చేసింది. అక్కడి నుంచే తన మాజీ భర్త సమ్మర్ వోర్డెన్ బ్యాంకు ఖాతాను ఒకసారి యాక్సెస్ చేసిందట. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫెడరల్ ట్రేడ్ కమిషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నాసా విచారణ చేపట్టింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉందా లేదా, బిల్లులు చెల్లించడానికి, కొడుకును చూసుకోవడానికి సరిపడా డబ్బులు ఉన్నాయా లేవా అని మాత్రమే పరిశీలించినట్టు ఆమె తన న్యాయవాది ద్వారా తెలిపింది. విడిపోవడానికి ముందు నుంచి వారిద్దరూ కలిసే బాలుడిని పెంచుతున్నారు. ఆమె తప్పేమీ చేయలేదని తనకు తెలిపిందని మెక్క్లెయిన్ తరఫు న్యాయవాది రస్టీ హార్డిన్ వెల్లడించారు. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా నాసా అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
అంతరిక్షంలో బ్యాంకు ఖాతా తెరిచినందుకు కోర్టు కేసు…
Related tags :