ముచ్చటపడి వేయించుకున్న టాటూ కొద్ది రోజుల్లోనే వెలిసిపోయిందా? అయితే ఇందుకు కారణం టాటూ వేయుంచుకున్న తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే! టాటూ గురించే కాదు, టాటూను కాపాడుకునే జాగ్రత్తల గురించీ తెలుసుకోవాలి!మద్యానికి దూరం..మద్యం రక్తాన్ని పలుచన చేస్తుంది. దాంతో టాటూ మానడం కష్టమవుతుంది.గోకకూడదు: టాటూ మానే సమయంలో చర్మం మీద తోలు లేవచ్చు. ఇలాంటప్పుడు దురద సహజం. అయితే దురద పుట్టిందని గోకితే మాత్రం టాటూ పాడవుతుంది. కాబట్టి క్రీమ్ లేదా వేజలీన్ పూసుకోవాలి.వ్యాయామాలు.. టాటూ వేయించుకున్న కండరాలు కదిలే బలమైన వ్యాయామాలు కనీసం 15 రోజుల పాటు చేయకూడదు. వ్యాయామం చేస్తే టాటూ వేయించుకున్న ప్రదేశం లోని కండరాలు, చర్మం కదిలి టాటూ అస్థవ్యస్తమవుతుంది.ఎండకు దూరం.. టాటూ వేయించుకున్న కొద్ది రోజుల వరకూ నేరుగా ఎండ తగలనివ్వకూడదు. లేదంటే టాటూ వెలిసిపోతుంది.త: స్విమ్మింగ్ పూల్లో ఈతకు దూరంగా ఉండాలి. స్నానం చేసే ముందు, తర్వాత టాటూకు వేజలీన్ అప్లై చేయాలి.
టాటూ సంరక్షణ ఇలా
Related tags :