భారత్‌లో డీజిల్ కార్ల విక్రయాలను కొనసాగించాలని టయోట నిర్ణయించింది. ఈ విషయాన్ని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కొత్త నిబంధనలు వస్తున్న నేపథ్యంలో ఈ కార్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే టయోటా భారత్‌లో బీఎస్-6 డీజిల్ ఇంజిన్లను తయారు చేసే ప్లాంటులో పెట్టుబడులను కూడా పెట్టింది. ‘‘డీజిల్ వేరియంట్లలో ఇంకా డిమాండ్ ఉన్న విషయాన్ని మేము గమనిస్తున్నాము. మేము వాటి తయారీని కొనసాగిస్తాము. సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే వరకు ఇది కొనసాగుతుంది. మేకిన్ ఇండియాను దృష్టిలో పెట్టుకొని దీనిని కొనసాగిస్తాము. ’’ అని టయోట కిర్లోస్కర్ మోటార్స్ వైస్ ఛైర్మన్ శేఖర్ విశ్వనాధన్ పీటీఐకు తెలిపారు. భారత్‌లో టయోటా ఇన్నోవా, ఫార్చ్యూనర్ వంటి పాపులర్ మోడళ్లను విక్రయిస్తోంది. టయోటా మోటార్స్ భారత్‌లో విక్రయించే కార్లలో డీజిల్, పెట్రోల్ వేరియంట్ల నిష్పత్తి 82:18గా ఉంది. దీంతో టయోటా డీజిల్ వేరియంట్లను కొనసాగించనుంది.
ఇండియాలో డీజిల్ టయోటాలు కొనసాగుతాయి
Related tags :