పెంపుడు జంతువులు, పక్షులు మనల్ని అనుకరించడం చూస్తూనే ఉంటాం. కుక్కలు, పిల్లులైతే మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులు తీసుకొచ్చి ఇస్తుంటాయి. బయటకు వెళ్లినప్పుడు యజమాని అనారోగ్యానికి గురైతే వెంటనే ఇంట్లోని వారిని తీసుకొచ్చిన శునకాలనూ మనం చూశాం. అలాంటిదే ఈ ఘటన కూడా. కానీ, ఇక్కడ సాయం చేసింది మాత్రం ఓ బాతు. ఓ బాలుడి చెప్పు గుంతలో పడిపోవడాన్ని గమనించిన బాతు, దాన్ని ముక్కుతో పట్టుకుని ఎంచక్కా పైకి తీసుకొచ్చి ఆ బాలుడికి అందించింది. తొలుత చెప్పును పట్టుకుని పైకి ఎక్కేందుకు ఒకటి, రెండుసార్లు ప్రయత్నించి విఫలమైంది. ఆ తర్వాత ఎట్టకేలకు దాన్ని బాలుడి చేతికి అందించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. బాతు ఏం చేసిందో మీరూ చూసేయండి.
https://www.facebook.com/myla.aguila/videos/2614928615192422/?t=0
మానవత్వానికి ముద్ర…ఈ ముద్దు బాతు
Related tags :