NRI-NRT

చెస్టర్‌స్ప్రింగ్స్‌లో మేడసాని హాస్య ప్రవచనం

Medasani Mohan Pravachanam By TANA In Chesterville PA-చెస్టర్‌విల్‌లో మేడసాని హాస్య ప్రవచనం

తానా మిడ్-అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో అవధాన ప్రక్రియలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహా మేధావి, ధారణ బ్రహ్మ, సరస్వతీ పుత్రులైన మేడసాని మోహన్ చే “సంస్కృతాంధ్ర సాహిత్యంలో హాస్యం-చమత్కారం” కార్యక్రమాన్ని శనివారం ఆగష్టు 24 సాయంత్రం 4 గంటలకు బయర్స్ స్టేషన్ క్లబ్ హౌస్ చెస్టర్ స్ప్రింగ్స్, పెన్సిల్వేనియా లో నిర్వహించారు. తానా కార్యదర్శి రవి పొట్లూరి, బోర్డు చైర్మన్ హరీష్ కోయ, ఫౌండేషన్ సెక్రటరి రవి మందలపు, నాగరాజు నలజుల, సతీష్ చుండ్రు, సతీష్ తుమ్మల, వేణు సంగాని, సాయి జరుగుల మరియు దాదాపు రెండువందలకు తెలుగు భాషాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.