1. పౌర సేవలకు జనతా జనార్దన్!
అరచేతిలో ప్రభుత్వ సేవలు, సమాచారం అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి ప్రయోగమే చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి.. ఓ మొబైల్ యాప్‌ను రూపొందించింది. ప్రజలకు అందుబాటులోకి తేబోతున్న ఈ మొబైల్ యాప్ పేరు ఏమిటో తెలుసా.. జనతా జనార్దన్.. ప్రజలే ప్రభువులుగా భావించి, వారికి సేవలందించేందుకు ఉద్దేశించిన యాప్ కాబట్టి.. ఈ పేరు ఖరారు చేశారు. ప్రస్తుతమున్న వివిధ వెబ్‌సైట్లు, పోర్టళ్లతో అనుసంధానం కానుంది.
2. నేటి నుంచి భాషోత్సవాలు: మంత్రి సురేష్
తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి జయంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం సోమవారం నుంచి ఈ నెల 29 వరకు భాషోత్సవాలను నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
3. క్షయకూ రాజధానే
తెలంగాణలో క్షయ, కుష్ఠు వ్యాధులు చాపకింద నీరులా ప్రబలుతున్నాయి. గత ఏడాది కొత్తగా 52 వేల మంది క్షయ బాధితులు, 3 వేల మంది కుష్ఠు బాధితులు నమోదయ్యారు. హైదరాబాద్‌లో అత్యధికంగా బాధితులు ఉన్నారు. అంటువ్యాధుల గుర్తింపు లక్ష్యంలో.. ఏటా 60-70 శాతాన్ని మించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు వ్యాధుల నిర్మూలనే లక్ష్యంగా.. బాధితులను వంద శాతం గుర్తించేందుకు నేటి నుంచి వచ్చే నెల 12 వరకూ ప్రత్యేక కార్యాచరణ నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి పరీక్షించే విధానం అమలు చేస్తున్నారు.
4. పౌష్టిక సుదృఢభారత్
ఆరోగ్యకరమైన భారత్ కోసం మూడు నూతన ప్రజా ఉద్యమాలు చేపట్టనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. దృఢమైన ప్రజానీకం ఉండేలా చూసేందుకు ‘ఫిట్ ఇండియా ఉద్యమం’, పసిపిల్లల కోసం ‘పౌష్టికాహార ఉద్యమం’, పర్యావరణ పరిరక్షణ కోసం ‘ప్లాస్టిక్ వ్యర్థాల వ్యతిరేక ఉద్యమం’ నిర్వహించనున్నట్టు తెలిపారు. తొలి ఉద్యమమైన ‘ఫిట్ ఇండియా’ను ఈ నెల 29న ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఈ ఉద్యమాల విషయాన్ని ప్రస్తావించారు.
5. 9వ తరగతి నుంచి ‘కృత్రిమ మేధ’
మారుతున్న సాంకేతిక పరిస్థితులపై అవగాహన పెంచుకునేందుకు వీలుగా ఈ విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి నుంచి కేంద్ర మాధ్యమిక విద్యామండలి (సీబీఎస్‌ఈ) ‘కృత్రిమ మేధను’ ఐచ్ఛిక సబ్జెక్టుగా అమలు చేస్తోంది. యోగా, శిశు విద్య అనే వాటిని కూడా ఐచ్ఛికాలుగా ప్రవేశపెట్టాలని గత మార్చిలో బోర్డు నిర్ణయించింది. తొమ్మిదో తరగతిలో ‘కృత్రిమ మేథ’ను తీసుకుంటే పదో తరగతిలో కూడా దాన్నే ఎంచుకోవాలి. తప్పనిసరి సబ్జెక్టులు అయిదు ఉంటాయి. ఆరో సబ్జెక్టుగా ఒక ఐచ్ఛిక సబ్జెక్టును తీసుకుంటారు.
6. మట్టి కప్పుల్లో గరం ఛాయ్
ప్రయాణ సమయంలో చూడచక్కని మట్టి కప్పుల్లో వేడివేడి తేనీరు సేవించగలిగే అవకాశం త్వరలో కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్‌ల్లోని స్టాళ్లు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్‌లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్గరీ ఈ మేరకు రైల్వేమంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. వంద రైల్వేస్టేషన్లలో తేనీటి కోసం మట్టికప్పులను తప్పనిసరి చేయాల్సిందిగా కోరినట్లు చెప్పారు.
7. ‘గ్యాంగ్ లీడర్’ చిత్రబృందం మీడియా సమావేశం
8. వ్యవసాయానికో ఆలోచన
వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో నూతన విధానాలు, పద్ధతులను ప్రవేశపెట్టే వినూత్న ఆలోచన మీ దగ్గర ఉందా…అయితే దానికి రెక్కలు తొడిగి దేశమంతా ఎగిరేలా చేసేందుకు ‘జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ సంస్థ’(నార్మ్) ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం ‘అగ్రి ఉడాన్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని జాతీయస్థాయిలో నిర్వహించనుంది. ‘ఎ-ఐడియా’ అనే సొసైటీ ద్వారా ‘అగ్రి ఉడాన్’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. రైతులకు లేదంటే ప్రజలకు మరింత సులువుగా సేవలు అందించవచ్చనే ఆలోచన ఎవరి దగ్గర ఉన్నా దానికి ఒక రూపం ఇచ్చి క్షేత్రస్థాయిలో అమలుచేయడానికి ఎ-ఐడియా ప్రోత్సహిస్తుంది.
9. సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో దేశీయ సమీకరణ నిబంధనల సడలింపు!
దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) మరింతగా ఆకర్షించే చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. విదేశీ ఏక బ్రాండ్ రిటైలింగ్ సంస్థలు దేశీయంగా వ్యాపారం నిర్వహించాలంటే, 30 శాతం సరకును స్థానికంగానే సమీకరించాలన్న (లోకల్ సోర్సింగ్) నిబంధనను సడలించే ప్రతిపాదన సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశీయంగా విదేశీ సంస్థలు విక్రయశాలలు ప్రారంభించే ముందు, ఆన్‌లైన్ అమ్మకాలు ప్రారంభించేందుకూ అనుమతించాలన్నది ప్రతిపాదనగా చెబుతున్నారు. ప్రస్తుతం విక్రయశాలలు ప్రారంభించాకే, ఆన్‌లైన్‌లో అమ్మకాలకు విదేశీ ఏకబ్రాండ్ రిటైలర్లను అనుమతిస్తున్నారు.
10. విండీస్‌పై భారత్ ఘన విజయం.
టెస్టు సిరీస్‌లోనూ టీమిండియా శుభారంభం చేసింది. ఫాస్ట్ బౌలర్ బుమ్రా(5/7) విజృంభించడంతో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 318 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. బుమ్రాతో పాటు పేస్ బౌలర్లు ఇషాంత్ శర్మ(3/31)