Fashion

ఈ చొక్కా వానకు తడవదు బ్రదర్

This Shirt Is Hydrophobic That It Doesnt Get Wet In Heavy Rains

వర్షం పడుతోంది. నానిపోని డ్రస్సులుంటే ఎంత బాగుండు! అనే వారి కోసం వానలో తడవని షర్ట్స్‌ మార్కెట్లోకి వచ్చాయి. వర్షాకాలంలో రెయిన్‌ జాకెట్లు వేసుకొని, ఫ్యాషన్‌గా కన్పించడానికి ఇబ్బంది పడేవారికి ఇవి ఎంతో ఉపయుక్తం. ఒక ప్రత్యేకమైన దారంతో తయారు చేసిన వస్త్రంతో ఇలాంటి ట్రెండీ షర్ట్స్‌ డిజైన్‌ చేయించుకొని వేసుకోవచ్చు. రెడీమేడ్‌గా ఆన్‌లైన్‌ అంగడిలోనూ లభ్యమవుతున్నాయి. కాటన్‌ దారాన్నే హైడ్రోఫోబిక్‌-హైడ్రోఫిలిక్‌గా మార్చి ఈ కొత్తదారాన్ని ఉత్పత్తి చేశారు. ఇది ద్రవపదార్థాలను పీల్చుకోదు. ఒక్క వానే కాదు, ఇంక్‌, టీ, వైన్‌ మరకలు దీనిపై పడవు. ఇలాంటి ప్రత్యేక లక్షణాలున్న వస్త్రంతో షర్ట్‌లు కుట్టి మార్కెట్లోకి వదులుతున్నారు. ప్రస్తుతానికి దీని ధర ఎక్కువగా ఉన్నా భవిష్యత్తులో అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. అన్ని దుస్తుల్లానే వాషింగ్‌ మెషిన్‌లో ఉతుక్కొనే వెసులుబాటు ఉండటంతో యువత వీటిపై మొగ్గుచూపుతున్నారు.