DailyDose

ప్రభుత్వంపై గుడ్డకాల్చి వేయడమే చంద్రబాబు పని-రాజకీయ–08/27

Telugu Political News Today - Aug 27 2019 - ప్రభుత్వంపై గుడ్డకాల్చి వేయడమే చంద్రబాబు పని-రాజకీయ–08/27

*భూములిచ్చిన రైతులకు ఏటా ఆగస్టు,సెప్టెంబర్ లొనే కౌలు డబ్బులు విడుదల చేస్తున్నారు…రాజకీయ లబ్ది కోసం ఏ అంశం దొరుకుతుందని చాలామంది ఎదురుచూస్తున్నారు…గతంలో ఎప్పుడు వరదలు వచ్చినా బాధితుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చేవి…పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వం పై విమర్శలు చేయించారు…చంద్రబాబు ఇంటి విషయంలో మాపై అనేక నిందలు వేశారురైతులకు నష్టం వచ్చేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ప్రభుత్వంపై గుడ్డ కాల్చివేయడం తప్ప చంద్రబాబుకి ఇంకేమీ తెలియదుచొక్కాలు మార్చినట్టు,అమరావతి మార్చడం సరికాదని సుజనా అంటున్నారు. ఇప్పటికీ తెలుగుదేశం మాటలు సుజనా మాట్లాడుతున్నారుజాతీయ పార్టీలో ఉంది బాధ్యతగా మాట్లాడాలసుజనా కున్న 120 కంపెనీలున్నాయిసుజనా కు చెందిన జితిన్ కుమార్,కళింగ గ్రీన్ టెక్ కంపెనీ చండర్లపాడు మండలం గుడిమెట్ల లో 110 ఎకరాలు ఉన్నదసుజనా సోదరుడి కుమార్తె యలమంచిలి ఋషికన్యకు వీరులపాడు మండలం గోకరాజుపాలెం లో 14 ఎకరాలు ఉందినందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి 493 ఎకరాలు లక్ష రూపాయల చొప్పున రామారావుకి ఇచ్చారు. ఏపీఐఐసీ ద్వారా భూమి ఇచ్చిన తర్వాత సీఆర్డీఏలో కలిపారు. రాజధాని ఒక సామాజిక వర్గానికి, ఒక ప్రాంతానికి చెందినది కాదని చెప్పాను.
* తెలంగాణకు మణిహారం ‘‘ఆస్ట్రా’’: కిషన్ రెడ్డి
భారత్, ఇజ్రాయెల్ భాగస్వామ్యంతో ఆస్ట్రా రాఫెల్ కమ్యూనికేషన్ సిస్టం(ఏఆర్సీ)ని రావిర్యాలలో ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మేక్‌ ఇన్ ఇండియాకు అనుగుణంగా దేశ రక్షణ కోసం అత్యాధునిక, వ్యూహాత్మక కమ్యూనికేషన్ వ్యవస్థలను ఇక్కడ ఉత్పత్తి చేస్తారని చెప్పారు. ఈ పరిశ్రమ తెలంగాణకు మణిహారం అని పేర్కొన్నారు. ఏఆర్సీ భారతదేశ రక్షణ అవసరాలు, ఎగుమతులపై దృష్టి పెడుతుందన్నారు. ఏఆర్సీ భారత సాయుధ దళాలకు అవసరమైన మెటీరియల్‌ను అందిస్తుందని చెప్పారు. దీని ద్వారా ఇక్కడ యువతకు కూడా ఉపాధి అవకాశం లభిస్తుందన్నారు.
* కొత్త ప్రభుత్వం ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు: సుజనా
ఒక రాజకీయ పార్టీని చూసి రైతులు రాజధానికి భూములు ఇవ్వలేదని, అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. మంగళవారం రాజధాని ప్రాంతంలో బిజేపీ నేతల బృందం పర్యటించింది. ఈ సందర్బంగా సుజనా ఏబీఎన్ మాట్లాడుతూ రాజధాని పనులు ఆపటం లేదని మంత్రి బొత్స అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం సరికాదని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే కానీ రాజధాని అనేది తప్పనిసరని అన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగితే దాని గురించి విచారణ చేయాలన్నారు.
* మాట తప్పం, మడమ తిప్పం అన్న నేతలు.. ఇప్పుడు..: కన్నా
అమరావతి రాజధానిని అందరూ ఆహ్వానించారని, జగన్‌ కూడా అమరావతిని ఆహ్వానించినట్టు గుర్తని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. మంగళవారం రాజధాని ప్రాంతంలో బిజేపీ నేతల బృందం పర్యటించింది. రైతులతో మాట్లాడిన అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూ మాట తప్పం, మడమ తిప్పం అన్న నేతలు…ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పటడుగులు వేస్తోందని, ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశానని, సీఎం నుంచి స్పందన రాలేదని అన్నారు. ఈ ప్రభుత్వంలో ఆత్రం తప్ప, పని కన్పించడంలేదన్నారు. ప్రభుత్వంలో ఉన్నామని మరిచిపోయి… ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
* ఏపీని నాశనం చేయడమే జగన్ డ్రీమ్: యనమల
ఏపీకి చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ తీసుకువచ్చారని, ఆయన తెచ్చిన ఇమేజిని నాశనం చేయడమే జగన్ డ్రీమ్ అని ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం నిర్వాకాలతో రాష్ట్రం నాశనం అవుతోందన్నారు. జిఎస్‌టిపై జగన్‌కు అవగాహన లేదని, రాష్ట్ర రాబడి పెంచడంపై దృష్టి లేదన్నారు. వైసీపీ నేరాల చరిత్ర చూసే రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలేదన్నారు. బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని, వ్యవసాయం, పరిశ్రమలు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఉపాధి అన్నిరంగాలకు తూట్లు పొడుస్తున్నారని, ఒకవైపు కరువు, మరోవైపు వరదలతో వ్యవసాయం కుదేలైందన్నారు
* ఆత్రమే తప్ప పని జరగడం లేదు: కన్నా
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విషయంలో స్థానిక రైతులకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిని చేసిందని, తాను అప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో ఉండి రాజధానికి మద్దతు పలికానని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి జగన్‌ కూడా పాదయాత్ర సందర్భంగా రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పారని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి, కన్నా లక్ష్మీనారాయణతోపాటు పలువురు భాజపా నేతలు రాజధాని గ్రామాల్లో పర్యటించారు.
* జగన్‌ ఆదేశాలతోనే బొత్స వ్యాఖ్యలు: యనమల
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి హైదరాబాద్‌లో ఎకానమీని పెంచడమే ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యమని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. తెరాస రుణం తీర్చుకోవడానికి ఏపీ అభివృద్ధికి గండికొట్టడం హేయమని ఆయన దుయ్యబట్టారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యానికి జగన్ రివర్స్ రూలింగ్‌ పాలనే కారణమని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఆదేశాలతోనే రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.
*రెండు పడక గదుల ఇళ్లు నిర్మించే వరకు పోరు: రమణ
అర్హత కలిగిన పేదలందరికీ రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇచ్చేంత వరకు పోరాటం సాగిస్తామని తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. సోమవారం హైదరాబాద్లోని ధర్నా చౌక్లో ఇళ్ల నిర్మాణంలో జాప్యానికి నిరసనగా పార్టీ రాష్ట్ర కమిటీ మహా ధర్నా నిర్వహించింది.రమణ మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 22 లక్షల మంది ఇళ్లు లేని పేదలు ఉన్నారన్నారు. తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. తెదేపా జాతీయ అధికార ప్రతినిధి అరవింద్కుమార్ గౌడ్, అశ్వారావుపేట శాసనసభ్యుడు ఎం.నాగేశ్వరరావు మాట్లాడారు.
*కేటీఆర్ను మళ్లీ ప్రభుత్వంలో చూడాలని ఉంది
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మళ్లీ ప్రభుత్వంలో చేరాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఆకాంక్షించారు. ఆయన మళ్లీ మంత్రివర్గంలోకి వస్తారని తాను ఎదురుచూస్తున్నానని సోమవారం అసద్ ట్విటర్లో పేర్కొన్నారు. ఒప్పో, అమెజాన్, వన్ప్లస్ వంటి సంస్థల ప్రాంగణాల ఏర్పాటు ఘనత మాజీ మంత్రి కేటీఆర్దేనని వెల్లడించారు. ‘ఎంపీ సాబ్! మీ అభిమానానికి కృతజ్ఞతలు’ అంటూ కేటీఆర్ అసద్కు రీట్వీట్ చేశారు.
*మైనింగ్ అక్రమార్కులకు ప్రభుత్వం వత్తాసు
అక్రమ మైనింగ్ వ్యాపారులకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తూ, కేంద్ర చట్టాన్ని ధిక్కరిస్తోందని.. మైనింగ్ సంస్థల అక్రమాల్ని అధికారులు నిర్ధారించినా చర్యలు తీసుకోవట్లేదని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర గనుల మంత్రి ప్రహ్లాద్ జోషికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన గనుల వ్యాపారులపై చర్యలు తీసుకోవడంతోపాటు వారి నుంచి రావల్సిన మొత్తాన్ని రాబట్టాలని.. 2008 నుంచి ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ విలేకరులతో మాట్లాడారు.
*ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్రెడ్డి ప్రమాణం
శాసనసభ్యుల కోటాలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన గుత్తా సుఖేందర్రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఆవరణలోని తన కార్యాలయంలో గుత్తాతో మండలి ఉపఛైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యేలు భాస్కర్రావు, గొంగిడి సునీతలతో కలిసి గుత్తా విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో మండలి సభ్యునిగా ఎన్నికయ్యానని, ఆయన అడుగుజాడల్లో నడుస్తానని తెలిపారు.
*మంత్రివర్గంలో 50 శాతం బీసీలుండాలి: ఆర్.కృష్ణయ్య
రాష్ట్రమంత్రివర్గంలో 50 శాతం బీసీలుండేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. మొత్తం 17 మందిలో సగం మంది బీసీ మంత్రులుంటేనే సామాజిక న్యాయం కల్పించినట్లవుతుందన్నారు. సోమవారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం మంత్రివర్గంలో 11 మంది మంత్రులుండగా అందులో బీసీలు కేవలం ముగ్గురే ఉన్నారన్నారు.
*ఎన్నికల్లో సమూల మార్పులు రావాలి
ఎన్నికల విధానంలో సమూల మార్పులు అవసరమని త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయడమంటే పెట్టుబడులు పెట్టి తిరిగి సంపాదించుకుంటామనే ధోరణి పోవాలని.. 30-40 శాతం ఓట్లు, ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీలు గద్దెనెక్కే పద్ధతిలో మార్పురావాలని సూచించారు. ‘అవే’ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. అవినీతి నిర్మూలన ఉద్యమంలో రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. మీడియా ఎందుకో తన బాధ్యత మరిచిపోయిందనే భావన కలుగుతోందన్నారు. లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.. పాలకులు, అధికారులు నిజాయతీగా ఉంటే సుపరిపాలన సాధ్యమవుతుందన్నారు.
*తెరాసలో బీసీలకు న్యాయం చేయాలి
తెరాసలోని బీసీ నేతలకు న్యాయం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. జనాభాలో సగభాగంగా ఉన్న బీసీ వర్గాలకుచెందిన వారికి పదవుల్లో పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బీసీ సంఘాల నేతలు గణేశాచారి, దుర్గయ్య, యాదగిరి, శ్యామ్లతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో బీసీలు కీలకపాత్ర పోషించారని, వారికి తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు.
*కర్ణాటకలో ముగ్గురు ఉపముఖ్యమంత్రులు
కర్ణాటకలో ముఖ్యమంత్రి యడియూరప్ప ముగ్గురు ఉపముఖ్యమంత్రులను నియమించారు. ఇటీవలే కర్ణాటకలో మంత్రివర్గాన్ని విస్తరించిన సంగతి తెలిసిందే. మంత్రులుగా నియమితులైన 17 మందిలో సోమవారం డాక్టర్ అశ్వర్థ నారాయణ, గోవింద కారజోళ, లక్ష్మణ సంగప్ప సవదిలకు ఉప ముఖ్యమంత్రి పదవులను కేటాయించారు. అలాగే మంత్రులకు శాఖలు కేటాయింపు జరిగింది.
*రాష్ట్రంలో ఎక్కడికక్కడ రాజధాని బోర్డులు: ఉమా
రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నోరు విప్పడం లేదని, మంత్రులు తలో రకంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. కృష్ణా జిల్లా నందిగామలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో ఎక్కడికక్కడ రాజధాని బోర్డులు ఏర్పాటుచేసి కొందరు స్థిరాస్తి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
*జగన్ది తుగ్లక్ పరిపాలన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ది తుగ్లక్ పరిపాలన అని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. సోమవారం సాయంత్రం విజయవాడ దాసరిభవన్లో సీపీఐ అగ్రనాయకుడు, కేంద్ర హోంశాఖ మాజీమంత్రి ఇంద్రజిత్ గుప్తా శతజయంతి కార్యక్రమంలో భాగంగా ‘వర్తమాన రాజకీయాలు-కమ్యూనిస్టుల కర్తవ్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఇందులో రాజా మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ఉద్యోగాల పేరిట వంచన, నూతన విధానం పేరిట ఇసుక సరఫరా నిలిపివేయటం, నేతల బొమ్మల కోసమని అన్నక్యాంటీన్ల మూసివేత, చివరికి వరదల నెపంతో అమరావతి రాజధాని మార్పు అంటూ చేస్తున్న తుగ్లక్ పాలనపైన పోరాడాల్సిన అవసరముందన్నారు.
*రైతులను ఆదుకోవాలి: కన్నా
రాజధాని ప్రాంతంలో రైతులకు, రైతు కూలీలకు ఉపాధి పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. కన్నాను గుంటూరులోని ఆయన నివాసంలో రాజధాని ప్రాంతంలోని రాయపూడికి చెందిన ఎస్సీలు, రైతుకూలీలు సోమవారం కలిశారు. రాజధాని అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేలా చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో కలిసి రాజధాని ప్రాంతంలో మంగళవారం పర్యటిస్తానని పేర్కొన్నారు. రైతుల తరఫున పోరాడతామని తెలిపారు.