DailyDose

ఇకపై ఏటీఎంలో రోజుకు ఒకసారే నగదు తీయాలి-వాణిజ్య-08/27

Telugu Business News Today - Aug 27 2019

* ఏటీఎంల నుంచి డెబిట్, క్రెడిట్‌ కార్డులతో డబ్బులను డ్రా చేసుకోవచ్చు.. కానీ, కెనరా బ్యాంకు ఏటీఎం నుంచి నగదు విత్‌ డ్రా చేసుకోవాలంటే మాత్రం ఓటీపీని ఎంటర్‌ చేయాల్సిందే. కాకపోతే ఒక రోజులో రూ.10,000 ఆ పై మొత్తాలకే ఈ ఓటీపీ నిబంధన. ‘‘కెనరా బ్యాంకు ఏటీఎంలలో నగదు ఉపసంహరణలు ఇప్పుడిక మరింత సురక్షితం. రోజులో రూ.10,000కు మించి చేసే నగదు విత్‌ డ్రాయల్స్‌ ఓటీపీతో మరింత సురక్షితం కానున్నాయి. ఈ అదనపు ఆథెంటికేషన్‌ కార్డుదారుల ప్రమేయం లేకుండా అనధికారిక లావాదేవీలు జరగకుండా నిరోధిస్తుంది’’ అని కెనరా బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వరంగంలోని ఎస్‌బీఐ కార్డు లేకపోయినా, కస్టమర్లు తమ యోనో యాప్‌ సాయంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణల సేవను ఆరంభించిన విషయం తెలిసిందే.
*వచ్చే పక్షం రోజుల్లో ప్రభుత్వం మరో రెండు విడతల్లో ఉద్దీపన ప్యాకేజీల్ని ప్రకటించే అవకాశం ఉందని డీబీఎస్ నివేదిక అంచనా వేసింది.
*జీఎస్టీ వార్షిక రిటర్నుల దాఖలుకు గడువును మరో 3 నెలలు పాటు.. అంటే నవంబరు 30 వరకు పొడిగించారు.
*గురుపూజోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని డీఈవో పాండురంగస్వామి ఏర్పాట్ల కమిటీ సభ్యులను ఆదేశించారు.
*వరుసగా అయిదోరోజూ బంగారం ధరలు పెరిగాయి. మేలిమి (999 స్వచ్ఛత) బంగారం 10 గ్రాముల ధర సోమవారం రూ.675 పెరిగి, రూ.39670కి చేరింది. వెండి కూడా కిలోకు రూ.1450 అధికమై రూ.46,550కి చేరింది.
*ఇంట్లో కూర్చున్న చోటు నుంచి కదలకుండానే లైట్లు, కెమేరా, స్మార్ట్ పరికరాల వంటివి ఆన్ – ఆఫ్ చేసేందుకు ఉపయోగపడే గూగుల్ నెస్ట్ హబ్ పరికరాన్ని దేశీయ విపణిలోకి గూగుల్ ప్రవేశ పెట్టింది.
*డీజిల్ ఇంజిన్తో నడిచే చిన్న కార్ల తయారీ నిలిపి వేయాలని నిర్ణయించినందున, ఆ స్థానాన్ని సీఎన్జీ ఇంజిన్ కార్లతో భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీవీ రామన్ తెలిపారు.
*విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తోంది.
*‘‘పంచెకట్టు అవమానం కాదు.. అది మన భారతీయుల గౌరవం, సంప్రదాయం. మన సంస్కృతి..’’ అని రామ్రాజ్ కాటన్ సంస ఛైర్మన్, వ్యవసాపకులు కె.ఆర్.నాగరాజన్ అన్నారు. నెల్లూరు నగరంలోని ట్రంకురోడ్డులో ఆ సంస 100వ షోరూంను రామ్రాజ్ కాటన్ బ్రాండ్అంబాసిడర్ ప్రముఖ సినీ నటుడు వెంకటేష్ చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు.
*ఇజ్రాయెల్కు చెందిన రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ మనదేశంలో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందుకు హైదరాబాద్ను కేంద్రస్థానంగా చేసుకోవటం ఆసక్తికరమైన అంశం.
* ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల మేర డివిడెండు, అదనపు నిధులను బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) బోర్డు ఆమోద ముద్ర వేసింది.
*చైనాకు చెందిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ల సంస్థ వన్ప్లస్ భారత్లో తన తొలి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించింది.