Devotional

తితిదే నగలు మింగుతున్న ఇంటిదొంగలు

TTD Balaji Jewelry Going Missing

తిరుమల తిరుపతి దేవస్థానంలో భద్రతా డొల్లతనం ప్రతి సందర్భంలోనూ బట్టబయలు అవుతోంది. ఏకంగా స్వామివారికి వచ్చిన నగలు గల్లంతు అయిన వ్యవహారం కలకలం రేపుతోంది. గుర్తించినవి కొన్నే మరి గుర్తించని ఎన్నో గత కొంత కాలంగా టీటీడీలో నగలకు సంబంధించి వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా ట్రెజరీలో ఉన్న 5.4 కిలోల వెండి కిరీటం, రెండు ఉంగరాలు, గోల్డ్ చిన్ చోరీకి గురైనట్లు నిర్ధారించారు. దర్యాప్తు చేపట్టిన టీటీడీ అధికారులు ఏ ఈవో శ్రీనివాసులును బాద్యుడిగా తేల్చారు. అతనిపై టీటీడీ చర్యలు ఉపక్రమించింది. అతని వేతనాల నుంచి రికవరీ పెట్టినట్లు చెబుతున్నారు. అయితే ఈనగల తస్కరణ ఎప్పుడు జరిగింది అన్నది తేల్చాల్సి ఉంది. వెంకటేశ్వర స్వామికి వచ్చిన నగలను దొంగలించిన వ్యక్తిని బాద్యతల నుంచి తప్పించాకుండా నగదు రికవరీ చేయటం ఏమిటనేది విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు తప్పు చేసిన వ్యక్తి నుంచి కేవలం రికవరీకి సిఫారసు చేసింది ఎవరు అనేది కూడా చర్చనీయంశంగా మారింది.