Editorials

టోక్యో అత్యంత భద్రమైన నగరం

Tokyo ranks top in world's best safest cities

ప్రపంచంలో అత్యంత భద్రమైన నగరంగా మళ్లీ టోక్యో నిలిచింది. రెండు, మూడు స్థానాలను వరుసగా సింగపూర్‌, ఒసాకలు దక్కించుకున్నాయి. మన దేశ రాజధాని దిల్లీ 52వ స్థానంతో సరిపెట్టుకోగా, వాణిజ్య రాజధాని ముంబయి మాత్రం 45వ స్థానంలో నిలిచింది. ‘ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌’ సంస్థ… ఐదు ఖండాలకు చెందిన 60 నగరాల్లోని పరిస్థితులను మదింపు చేసి, ఈ ర్యాంకులను కేటాయించింది. యాంగూన్‌ (మయన్మార్‌), కరాచీ (పాకిస్థాన్‌), ఢాకా (బంగ్లాదేశ్‌)లు వరుసగా చివరి మూడు స్థానాలతో సరిపెట్టుకున్నాయి. డిజిటల్‌, మౌలిక వసతులు, ఆరోగ్య, వ్యక్తిగత భద్రత తదితర అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకులను కేటాయించారు.