DailyDose

పరారీలో చింతమనేని ప్రభాకర్-నేరవార్తలు–08/30

Chinthamaneni Prabhakar Undergrounded-Telugu Top Crime News-08/30

*దళితులను అసభ్య పదజాలంతో దూషించిన తెదేపా నేత దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టుకు రంగం సిద్దం అయ్యింది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం చింతమనేని పరారీలో ఉన్నట్లు సమాహారం. గురువారం పినకమిడిలో దళిత యువకులపై దాడి చేసిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అతన్ని తక్షణమే దాడి చేయాలని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపద్యంలో చింతమనేని కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న చింతమనేని పట్టుకునేందుకు ప్రత్యెక బృందాలు రంగంలోకి దిగాయని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
* ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హై కోర్టు సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్‌ స్టేషన్లలో కోడెల కుటుంబసభ్యులపై ఐదు కేసులు నమోదుఇద్దరిపై నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ మంజూరు.
*బెంగాల్ బీజేపీ అధ్యక్షుడుఎంపీ దిలీప్ ఘోష్‌పై కొంత మంది దుండగులు దాడికి పాల్పడ్డారు.
*గురజాలలో ఘోరం జరిగింది. ఈనెల 25న అదృశ్యమైన అన్నపరెడ్డి సుభాష్(4) శవమయ్యాడు. అదృశ్యమైన 6 రోజులకు మృతదేహం లభ్యమైంది. సుభాష్‌‌ను దుండగులు ముక్కలు ముక్కలుగా నరికి పడేశారు. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీంను రంగంలోకి దింపి తనిఖీలు చేస్తున్నారు.
* తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో విషాదం నెలకొంది. ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్‌ పెనుమత్స రామ కృష్ణంరాజు అలియాస్‌ కృష్ణంరాజు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. డాక్టర్‌ కృష్ణంరాజు(55), ఆయన భార్య లక్ష్మీదేవి (45), పెద్ద కుమారుడు కృష్ణసందీప్‌ (25) బలవన్మరణానికి పాల్పడ్డారు. కృష్ణసందీప్‌ ఇటీవలే ఎంబీబీఎస్‌ పూర్తి చేసినట్టు సమాచారం. రెండో కొడుకు కృష్ణవంశీ రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు.
* బిహార్‌లోని గయ జిల్లాలో భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* రాష్ట్ర ఖజానా లోటుకు గురవుతుంటే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ఫ్రీ పథకాల అమలుతో పోతున్న సొమ్మును జరిమానాలతో రాబట్టుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం అనుకుంటోంది. ప్రజలకు ప్రభుత్వాలు చేసే దారి దోపిడీ గురించి పట్టదు. ఉచిత పథకాలతో ఎంత లబ్ది చేకూరిందనే చూస్తున్నారు. కొత్తగా ‘ప్రాణ రక్షణ’ ట్యాగ్తో సామాన్యులపై అధికారిక వసూళ్లకు పాల్పడుతోంది ప్రభుత్వం. ఆబ్కారీ ఆదాయం కోసం విచ్చలవిడిగా వైన్ షాపులకు లైసెన్స్లిచ్చేస్తోంది. అనధికారికంగా లైసెన్స్ లేని బెల్ట్ షాపులు ఎక్కడపడితే అక్కడే కనిపిస్తున్నాయి.
*ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు మండలంలోని కూకుడా గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చేగం పుల్లయ్య అనే వ్యక్తి పోలాల పండగ సందర్భంగా ఎడ్లను కడగడానికి గ్రామ సమీపంలోని నాగులమ్మ చెరువులో దిగాడు. లోతు ఎక్కువ ఉండటంతో పుల్లయ్య నీటిలో మునిగిపోయి గల్లంతయ్యాడు. ఒడ్డును ఉన్న గ్రామస్తులు చెరువులోకి దిగి పుల్లయ్య కోసం వెతుకుతున్నారు. ఇంతవరకు అతని ఆచూకి లభ్యం కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకున్నారు.
* సినిమాల్లో నటించే అవకాశాలు రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ వర్థమాన నటి అపార్టమెంట్‌ టెర్రస్‌ పై నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గతరాత్రి ముంబైలోని ఒషివార ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతురాలు పంజాబ్‌కు చెందిన నటిగా పోలీసులు గుర్తించారు. కాగా సినిమాల్లో ఛాన్స్‌ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
* అమలాపురం,ఆర్థోపెడిక్ డాక్టర్ రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్, పాయిజన్ ఇంజక్షన్ తో ఇంజక్షన్ చేసుకొని కుమారుని తో సహా ముగ్గురు మరణం.
*కారు బోల్తాపడి ఆత్మకూరు ఎఎస్‌ఐ రాజు మృతి చెందిన ఘటన శుక్రవారం ఆత్మకూరు మండలంలో చోటు చేసుకుంది. ఆత్మకూరు ఎఎస్‌ఐ రాజు ప్రయాణిస్తున్న కారు ఆత్మకూరు మండలం వాశిలి వద్ద పందిని ఢీ కొనడంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న ఆత్మకూరు ఎఎస్‌ఐ రాజు మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
*కాకినాడ రూరల్, లో వరుస బైక్ దోంగతనాలకు పాల్పడుతున్న. ముగ్గురు దోంగలను అరేస్టు చేసినా కాకినాడ రూరల్ పోలీసులు. వారి వద్ద నుండీ 3 లక్షల విలువ చేసే బైకులు, 60 వేల నగదు. సేల్ ఫోన్సు స్వాధీనం…
*ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కేంద్రానికి‌ చెందిన రైతు గూదే నరసింహారావు (40) పురుగుల మందు సేవించి ఆత్మహత్య.
*ఖమ్మం నగరంలోని క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు రాజశేఖర్ అనే డెంగ్యూ ఫీవర్ పేషేంట్ మృతి. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని బంధువులు ఆరోపణ,ఆసుపత్రి ముందు ధర్నా. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి డాక్టర్లు,సిబ్బందిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్…
*స్కూల్‌ బస్సు, ఆటోని ఢీకొనడంతో ఆటోలో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం తురకపాలెం లో చోటు చేసుకుంది. మాచవరం మండలంలోని తురకపాలెం గ్రామ సమీపంలో స్కాలర్స్‌ స్కూల్‌ బస్‌, తురకపాలెంకు చెందిన ఆటోని ఢీకొనడంతో ఆటోలోని నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్కూల్‌ బస్సులోని పిల్లలకి ప్రమాదం ఏమీ జరగలేదు. బస్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. గాయపడినవారిని పిడుగురాళ్ల ప్రైవేట్‌ హాస్పిటల్‌ కి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు…
*నెల్లూరు జిల్లా డక్కిలి మండలం, కుప్పయపాలెం రోడ్డులో… కల్వర్టు వంతెనపై నుండి బోల్తాపడిన, విద్యార్థులతో వెళుతున్న చైతన్య స్కూల్ బస్సు.విద్యార్థులకు గాయాలు, డక్కిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స..
*తిరువూరులో దారుణ హత్య కు గురైన VRO కేసులో పోలిసులు దర్యాప్తు వేగవంతంపాత నేరస్తురాలే హత్యకు కారణమని నిర్దారించిన పోలీసులుహత్య కు పాల్పడిన నిండుతురాలి కోసం ప్రత్యేక బృందా ఏర్పాటురువూరు పట్టణంలో తంగేళ్లబీడు లో కనపర్తి రేణుక అనే పాత నేరస్తురాలు నివాసంలో విజయవాడ నగర శివారు పోరంకి కి చెందిన విఆర్వో అవనిగడ్డ గణేష్ (46) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు..సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన ప్రాథమిక సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డారు..మృతుడు గతంలో ఆగిరిపల్లి మండలంలో విఆర్వో గా చేస్తూ ఈ సవంత్సరం ఫిబ్రవరి నెల నుండి ఉద్యోగానికి సెలవులో ఉన్నాడు..ఈ రోజు తిరువూరు హత్యకు గురికావడంతో స్థానికంగా సంచలనం కలిగించింది..ఈ సందర్భంగా నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ హత్యకు పాల్పడిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నిందుతురాలిపై గతంలో పలు నేరాలు నమోదు అయినట్లు డిఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు..
*ప.గో…జిల్లా తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం గ్రామంలో లో బ్యాటరీ దొంగల కలకలంఒక బృందం గా ఏర్పడి, కారులోవచ్చి లారీల లోని బ్యాటరీల దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులుకారు నెంబర్ ap 39l 1629 స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చి దొంగతనానికి పాల్పడుతుండగా రెడ్ హ్యాండెడ్ దొరికిన దుండగులు దొంగల్లో ఒకరు పరారు కాగా ఇద్దరిని పట్టుకున్న నవాబుపాలెం లారీ వర్కర్స్దొంగలను గ్రామంలోని గాంధీ బొమ్మ దగ్గర స్థంబానికి కట్టి దేహశుద్ధి చేసి రూరల్ పోలీసులకు సమాచారమందించిన లారీ వర్కర్స్
*ఆత్మకూరు మండలం వాశిలి వద్ద రోడ్డు ప్రమాదం .కారు బోల్తా కారులో ప్రయాణిస్తున్న ఆత్మకూరు Aఎస్సై రాజు అక్కడికక్కడే దుర్మరణం
*పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఇసుక విధానాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగిన తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు అరెస్ట్‌ చేసి యలమంచిలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
*తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఓ వైద్యుడు తన భార్య, కుమారుడితో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైద్యుడు రామకృష్ణరాజు, భార్య లక్ష్మీదేవి, కుమారుడు కృష్ణ సందీప్‌ బలవన్మరణానికి ఒడిగట్టారు. రామకృష్ణరాజు ఎముకల వైద్యుడిగా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*హైదరాబాద్ నుంచి దిల్లీకి వెళుతున్న తెలంగాణ ఎక్స్ప్రెస్ (నెం.12723)లో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి.
*పదేళ్ల బాలిక నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారయత్నానికి పాల్పడిన రాజేష్ (28) అనే యువకుడిపై విశాఖ రెండో పట్టణ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
* భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తిప్పాపురం రహదారిలో మావోయిస్టులు గురువారం సాయంత్రం మందుపాతర పేల్చారు.
*సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ సరోగసీ (అద్దె గర్భం) కోసం చెన్నైకి వెళ్లిన ఘటన సంచలనంగా మారింది.
*తమిళనాడులోని కోయంబత్తూరులో గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది.
*దేశంలో రోజురోజుకి మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా గురువారం హరియాణాలోని గురుగ్రామ్లో ఓ కారు డ్రైవర్ మహిళా టోల్ సిబ్బందిపై దాడి చేసిన వీడియో సంచలనం సృష్టిస్తోంది.
*వేధింపులకు పాల్పడిన యువకుడికి ఓ మహిళ దేహశుద్ధి చేసింది. భార్యాభర్తలు యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావికి చెందిన శ్రీశైలం అనే యువకుడు అదే కాలనీకి చెందిన వివాహిత పట్ల కొంతకాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు.
*మాదకద్రవ్యాలకు బానిసైన కుమార్తెను కాపాడుకునేందుకు ఓ తల్లి ఆమెను గొలుసులతో బంధించింది. పంజాబ్లోని మత్తుబానిసల తీవ్రతను ఈ ఘటన తెలియజేస్తోంది.
*పదేళ్ల బాలిక నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారయత్నానికి పాల్పడిన రాజేష్ (28) అనే యువకుడిపై విశాఖ రెండో పట్టణ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
*సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ సరోగసీ (అద్దె గర్భం) కోసం చెన్నైకి వెళ్లిన ఘటన సంచలనంగా మారింది.
*మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో 10 మంది సభ్యుల అంతరాష్ట్ర గంజాయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గంజాయి సేవిస్తున్న 39 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించారు.