అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఫోన్ సౌదీ అరేబియా అధికారులు హ్యాక్ చేసి సున్నితమైన వ్యక్తిగత డేటాను తస్కరించినట్లు తేలింది. గత ఏడాది సౌదీ అధికారుల చేతిలో హత్యకు గురైన కాలమిస్టు జమాల్ ఖషోగ్గి హత్యపై బెజోస్ పత్రిక వాషింగ్టన్ పోస్టు భారీగా కవర్ చేసింది. ఇటీవల జెఫ్ బెజోస్ వ్యక్తిగత సమాచారం బయటకు రావడంపై డిబెకర్ దర్యాప్తు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ‘‘మా దర్యాప్తు బృందం, పలువురు నిపుణులు పూర్తి విశ్వాసంతో చెప్పేది ఒకటే.. సౌదీ అధికారులు బెజోస్ ఫోన్‌ను హ్యాక్ చేసి ఆయన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారు. సౌదీ క్రౌన్‌ప్రిన్స్ సల్మాన్ వాషింగ్టన్ పోస్టును ప్రథమ శత్రువుగా చూశారు.’’ అని పేర్కన్నారు. ఇక్కడ బెజోస్ స్నేహితురాలి తమ్ముడికి డబ్బు చెల్లించారు. కానీ అక్కడ జరిగిన ప్రయత్నం మాత్రం ఒక వ్యక్తి చేసింది కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయంతోనే ఖషోగ్గి హత్య జరిగిందని సీఐఏ యుఎస్ సెనేట్‌కు నివేదించిన సంగతి తెలిసిందే.
ఏకంగా జెఫ్ బీజోస్ మీదే వలపన్నారు!
Related tags :