* ఇసుకపాలసీని ప్రకటించని ప్రభుత్వ తీరును నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ నేతలు నిరసనల్లో పాల్గొనేందుకు ప్రయత్నించారు. అంతకుముందే టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడును గృహనిర్బంధం చేశారు. దుగ్గిరాలలో దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఇంట్లో నిర్బంధించారు. దీంతో ప్రభాకర్ ఇంటి వద్ద పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
*అనంతపురం ఉరవకొండ గవిమఠం సహాయ కమిషనర్ కార్యాలయంపై ఎసిబి అధికారుల దాడులు,రాజు అనే వ్యక్తి నుండి రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్ శంకర్, జూనియర్ అసిస్టెంట్స్ నారాయణ స్వామి,గోపీ,నిందితులు అరెస్ట్.
* తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు కృష్ణానదీ జలాల పంపిణీ అంశాల్ని చర్చించేందుకు ఈ రోజు కృష్ణాబోర్డు సమావేశమైంది. రెండు రాష్ర్టాల మధ్య జలాల పంపిణీపై నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ఇన్‌ఫ్లోలపై సమావేశంలో చర్చించారు. నీటి విడుదలకు కృష్ణానది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
* అమరావతి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నూతన నిబంధనలురాష్ట్రంలోని ఏ వ్యక్తీ దగ్గరైన గాని మూడుకు మించి మద్యం బాటిళ్ళు ఉంచుకోకూడదుపర్మిట్ రూమ్లు రద్దు-రోడ్డుపై మద్యం సేవిస్తే శిక్షఎమ్మర్పీ రేట్లకే మద్యం – 9 గంటల వరకే మద్యం విక్రయాలునిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు
*ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరిని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో సివిల్, క్రిమినల్ న్యాయవాదిగా ఆయన పనిచేశారు. 2005లో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
* ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. 10 మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్న భారత షూటర్ అభిషేక్ వర్మ పసిడితో మెరిశాడు. పురుషుల విభాగంలో ఎనిమిది మంది తుది పోరుకు అర్హత సాధించగా అభిషేక్ వర్మ టాప్‌లో నిలిచాడు. మొత్తంగా ఫైనల్‌లో 244.2 పాయింట్లతో అభిషేక్ స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నాడు. ఫలితంగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
* రెండు నెలల పాటు క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. యూఎస్‌లో గోల్ఫ్ ఆడుతూ కొత్త అవతారంలో కనిపించాడు.
* రాష్ట్రంలో రవాణా వాహనాల వేగ నియంత్రణకు చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రవాణా వాహనాల్లో వేగ నియంత్రణ పరికరాలు అమర్చేలా రాష్ట్ర రవాణా శాఖను ఆదేశించాలని కోరుతూ ది రైట్ సొసైటీ సంస్థ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.
* ఇసుక కొరత సృష్టించి నిరుపేదలకు పనుల్లేకుండా చేసి వారి పొట్టకొట్టారని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర ఇసుక కొరతను నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ శ్రేణులతో కలిసి ఈరోజు ఉదయం ఆయన ధర్నాకు దిగారు. పాతబస్టాండ్ వద్ద మూతపడిన అన్న క్యాంటీన్ ఎదుట బైఠాయించిన ధర్నా నిర్వహించారు.
* అంతరాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కార్తీక సత్తా చాటింది. మహిళల ట్రిపుల్ జంప్‌లో 12.74 మీటర్ల దూరం దూకిన కార్తీక కాంస్యం గెలుచుకుంది. ఈ విభాగంలో భైరబి రాయ్ (పశ్చిమ బంగాల్, 13.01 మీ) స్వర్ణం కైవసం చేసుకుంది.
*పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనుకడుగు వేస్తున్నారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తిరుమలలో ఆయన మాట్లాడుతూ… రాజధాని నిర్మాణానికి రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారన్నారు. రాజధాని మార్చే కుట్ర జరుగుతోందన్న అనుమానం కలుగుతోందన్నారు. రైతులు, ప్రజలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారన్నారు. మంత్రుల ప్రకటనలతో అయోమయానికి గురవుతున్నారన్నారు.
* శ్రీశైలం దేవస్థానం ఔటర్ రింగ్ రోడ్డులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. చిరుతను చూసిన కర్ణాటక భక్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. తమ సెల్‌ఫోన్‌లో చిరుత సంచరిస్తు ఉండడాన్ని చిత్రీకరించారు. రింగ్ రోడ్డు సమీపంలో నివాసం ఉంటున్న స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. చిరుత సంచారంతో భక్తులు జాగ్రత్తగా ఉండాలని, రింగ్ రోడ్డువైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటవీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు..
* అనంతపురం జిల్లా ఉరవకొండ మార్కెట్ యార్డులో రైతు మృతి చెందడం పట్ల టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైతు మృతికి ప్రభుత్మే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఉరవకొండలో విత్తనాల కోసం వచ్చిన సమయంలో తోపులాటలో సిద్దప్ప అనే రైతు మృతి చెందాడు. విత్తనాల సరఫరాల ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు.
*తెలంగాణలో 17 మంది డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా వెల్లడించిన వివరాల ప్రకారం పదోన్నతి పొందిన బదిలీ అయిన వారి వివరాలు.. టి.కరుణాకర్ హైదరాబాద్‌కు, గిరిరాజు వరంగల్‌కు, సురేశ్ కుమార్ ఆసిఫాబాద్‌కు, షమీర్ జేఎస్‌కే రాచకొండకు, ఎన్.భాస్కర్ నిజామాబాద్‌కు, బి.కిష్టయ్య భద్రాద్రి కొత్తగూడేనికి, పి.శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ సిటీకి, సీహెచ్ కుమారస్వామి నారాయణపేటకు, టీఏ భరత్ ములుగుకు, ఎండీ రియాజ్ ఉల్ హక్ సిద్దిపేటకు, డి.సంజీవరెడ్డి హైదరాబాద్‌కు, ఎం.వెంకటరెడ్డి నిర్మల్‌కు, ఎస్.వీరారెడ్డి ఇంటెలిజెన్స్‌కు, బి.వినోద్‌కుమార్ గ్రేహౌండ్స్‌కు, పి.శ్రీనివాస్ ఇంటెలిజెన్స్‌కు, మహమ్మద్ బుర్హాన్ అలీ హైదరాబాద్‌కు, సయ్యద్ అన్వర్ హుస్సేన్ సైబరాబాద్‌కు బదిలీ అయ్యారు.
*ప.గో.జిల్లా పెదవేగి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక విధానంపై చేపట్టిన ధర్నా కార్యక్రమం జరగకుండా చూడాలని ఆలోచనతో ప్రభాకర్ ఇంటి చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు. ప్రభాకర్ బయటికి వస్తే అరెస్టు చేయడానికి సన్నాహాలు. దుగ్గిరాల లోని ప్రభాకర్ ఇంటికి చేరుకున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు.
*భుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తెదేపా ప్రత్యక్షపోరు చేస్తుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఇసుక కొరతతో వివిధ రంగాలపై పడిన ప్రభావాన్ని నిరసిస్తూ ఇవాళ తెదేపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు నిర్వహించనున్నారు. వైకాపా వేధింపులకు నిరసనగా సెప్టెంబర్ 3 నుంచి ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టనున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇకపై ప్రతివారంలో 2 రోజులు జిల్లాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.
* కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకాచౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఖమ్మం జిల్లా రెండో అదనపు ఫస్ట్ క్లాస్ కోర్టు వారెంట్‌ను జారీ చేసింది. తన భర్తకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ రేణుక మోసగించారని కళావతి అనే మహిళ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణలో భాగంగా న్యాయస్థానం రేణుకకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను తీసుకోకపోవడం, విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది.
*ఏపీ మంత్రివర్గం సెప్టెంబర్ 4న సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటిబ్లాక్‌లో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్ని శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రివర్గ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
* మంత్రి పదవి తనకు కులంతో వచ్చిన భిక్ష కాదని, తెలంగాణ ప్రజల కోసం చేసిన ఉద్యమమే మంత్రిని చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
*పసిడి ధరల పెరుగుదలకు అడ్డేలేకుండా పోయింది. దేశీయంగా మేలిమి (999 స్వచ్ఛత) బంగారం 10 గ్రాముల ధర గురువారం రూ.40,000 దాటింది.
*మంత్రి పదవి తనకు కులంతో వచ్చిన భిక్ష కాదని, తెలంగాణ ప్రజల కోసం చేసిన ఉద్యమమే మంత్రిని చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి బాసటగా నిలిచి కొట్లాడి సాధించిన తెలంగాణలో గులాబీ జెండాకు ఓనర్లం తామేనన్నారు.
*కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మరో భారీ రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) లిమిటెడ్ నుంచి రూ.18,751.38 కోట్ల రుణం తీసుకునేందుకు కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కార్పొరేషన్కు అనుమతి ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
*శ్రీశైలం జలాశయాన్ని గోదావరి జలాలతో నింపుతాం.. కృష్ణా – గోదావరి నదుల అనుసంధానంతో దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. సమైక్య పాలనలో తెలివి తక్కువ నాయకులు అధికారంలోకి రావడంతో తాగునీటికి సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డాం. సంకుచిత స్వభావంతో నీచంగా ఆలోచించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మహారాష్ట్ర ప్రభుత్వంతో గొడవపడి సాధించింది గుండు సున్నా’ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మండిపడ్డారు.
*గ్రామాల పచ్చదనం, పరిశుభ్రత, సమగ్రాభివృద్ధికి నిర్దేశించిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అక్టోబరు 5 లేదా 6వ తేదీ నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
*హైదరాబాద్ శివారు సుల్తాన్పూర్లోని వైద్య పరికరాల ఉత్పత్తి పార్కులో సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.
*మాతృభాష, మాతృమూర్తి, మాతృదేశం, పుట్టిన ఊరు, జ్ఞానం నేర్పిన గురువులపై ప్రతి ఒక్కరికీ మమకారం, గౌరవం ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మాతృభాష కళ్ల వంటిదని, పరాయి భాషలు కళ్లద్దాలవంటివని వ్యాఖ్యానించారు.
*ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి దశాబ్దాలుగా ఉన్న నిధుల కొరత కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో తీరిపోయింది. కేంద్ర ఖాతాలో జమచేసిన నిధుల్లోంచి రాష్ట్రాలకు ఏటా 10శాతం నిధులే వచ్చేవి. తాజాగా 90శాతం నిధుల్ని రాష్ట్రాలకు బదిలీ చేయాలని కేంద్ర పర్యావరణశాఖ నిర్ణయించింది.
*హైదరాబాద్ శివారు సుల్తాన్పూర్లోని వైద్య పరికరాల ఉత్పత్తి పార్కులో సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.
*రాష్ట్రంలో పీజీ ప్రవేశాలకు ఉద్దేశించిన సీపీజీఈటీలో ఎంపికైన అభ్యర్థులకు తొలి విడత కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. 30,640 సీట్లకుగాను 22,069 సీట్లు భర్తీ చేసినట్లు పరీక్ష కన్వీనర్ ఎన్.కిషన్ గురువారం తెలిపారు.
*గ్రూప్-2 మౌఖిక పరీక్షకు హాజరై, వివిధ ప్రభుత్వ విభాగాల్లో సహాయ సెక్షన్ అధికారి పోస్టులకు ఎంచుకున్న అభ్యర్థులకు సెప్టెంబరు 8వ తేదీ కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్ష నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ తెలిపారు.
* ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వాహనదారులకు ఇక కష్టకాలమే. సెప్టెంబరు 1 నుంచి నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై భారీగా అపరాధ రుసుము విధించే నిబంధనలను అమలులోకి తీసుకువస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఎమ్మెల్యే రామానాయుడు అరెస్ట్-తాజావార్తలు–08/30
Related tags :