కాలం గిర్రున తిరిగింది. కార్డులకు కాలం చెల్లింది. తపాలా శాఖ కధ మారింది. కొత్త సేవల్లోకి షిప్టు అయ్యింది. ఒఅక్ప్పుడు ఉతరాలు పోస్టు కార్డులు, మనియార్దార్లు, మోసుకొచ్చిన తపాలా శాఖ ఇప్పుడు సరుకు రవాణా, ఈ-కామర్స్ డెలివరీలు బ్యాంకింగ్, కొరియర్ బీమా పెన్షన్ పాస్ పోర్టు, ఆధార్ టీటీడీ టిక్కెట్ల , పుస్తకాలూ, మందుల బట్వాడా తదితర సేవల్లో బిజీ అయ్యింది. ఆర్ధిక అవసరాలా రిత్యా ప్రస్తుతం వాణిజ్యపర సేవలతో లాభాలు ఆర్జించే పనిలో పడింది. 160 ఏళ్ళు సేవలందించిన టెలీ గ్రాం ఐదేళ్ళ క్రితం కనుమరుగైంది. ఇంటర్నెట్, సెల్ ఫోన్, విప్లవంతో ఉత్తరాలు, పోస్టు కార్డులు ఈ-మెయిల్స్ ఎస్సెమ్మెస్‌లు మరిపించాగా మనియార్దార్లు డిజిటల్ బ్యాంకింగ్ మింగేసింది. ఆధునిక సాంకేతిక విప్లవంతో తపాలా శాఖ మనుగడ ప్రశ్నర్ధకమైంది ఈనేపద్యంలో ఆధునికతను అందిపుచ్చుకున్న తపాలాశాఖ వినూత్న ఆలోచనలతో సరికొత్త సేవలకు ముందడుగు వేసింది. పోస్టల్ సిబ్బందిని సరుకు రవాణా, ఈ-కామర్స్ డేలివరీలకు వినియోగించు కుంటుంది. మరోవైపు బ్యాంకింగ్ బాద్యతలు చేపట్టింది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పోస్టుకార్డు అదార్ నమోదు తదితర సేవలందిస్తోంది. ఉత్తరాలు, పోస్టుకార్డులు ఇన్ లాండ్ లెటర్లు క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. ప్రస్తుతం బిజినెస్ మెయిల్స్, పార్సిల్స్, స్పీడ్, రిజిస్టర్డ్ మేయిలోస్ పెరిగాయి. అత్యధిక శాతం పాస్ పోర్టు డ్రైవింగ్ లైసెన్సు ఏటీఏం కార్డులు బ్యాంకు చెక్ బుక్స్ స్టూడెంట్స్ స్టడీ మెటీరియల్ తదితరాల బట్వాడా జరుగుతోంది. తపాలా శాఖ సాంకేతికత విజ్ఞానంతో సాధారణ ఉత్తరాల బట్వాడాపై ద్రుష్టి సారించింది. పోస్టు బాక్సులు సకాలంలో క్లియరెన్స్ చేసేందుకు స్మార్ట్ ఫోన్ తో స్కానింగ్ నిర్వహిస్తోంది.
సాంకేతికతను ఆవాహన చేసుకున్న తపాలశాఖ
Related tags :