*సామాజిక మాద్యమం వాట్సాప్ త్వరలో డిజిటల్ చెల్లింపుల సేవలను భారత్ లో ప్రారంభించనుంది. డేటాను భారత్ లోనే నిలవే చేయాలన్న రిజర్వు బ్యాంకు నిబంధనలకు పూర్తీ స్థాయిలో ఈ సంస్థ కట్టుబడింది. ఆ దిశగా ముందడుగు పడుతోంది. ప్రస్తుతం డేటా నిల్వ, ప్రాసెసింగ్ కు సంబందించిన ఏర్పాట్లను ఖరారు చేస్తోంది. అంతా చెల్లింపుల సేవలను ప్రారంభించనుంది.
*ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్ల గడువు తేదీని మళ్లీ పొడిగించారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం కొట్టిపారేసింది. రిటర్న్ల దాఖలుకు నేడే చివరి రోజు (ఆగస్టు 31) అని స్పష్టం చేసింది.
*ఈక్విటీ డెరివేటివ్ విభాగంలో వారం రోజులు గడువుండే ఫ్యూచర్, ఆప్షన్ల (ఎఫ్అండ్ఓ) కాంట్రాక్టులను బొంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) తీసుకొని రానుంది.
*రెపో అనుసంధానిత గృహ, వాహన వడ్డీ రేట్లను అందుబాటులోకి తేనున్నట్లు ఐడీబీఐ బ్యాంక్ వెల్లడించింది.
*దేశీయ, అంతర్జాతీయ చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తిని రెట్టింపు చేసుకునే దిశగా ఓఎన్జీసీ అడుగులు వేస్తోంది. రిఫైనింగ్ సామర్థ్యాన్ని మూడింతలు పెంచుకునేందుకూ కసరత్తు చేస్తోంది. తద్వారా 2040 నాటికి లాభాలను నాలుగు రెట్లు పెంచుకోవాలని అనుకుంటోంది.
*ప్రభుత్వ రంగ ఖనిజ సంస్థ అయిన ఎన్ఎండీసీ లిమిటెడ్ చత్తీస్గఢ్లో ఏర్పాటు చేస్తున్న స్టీలు ప్లాంటు నిర్మాణం పూర్తయ్యే దశలో ఉంది.
* నిర్మాణాలను పగుళ్లు లేకుండా చూడటంతోపాటు, పర్యావరణహితంగానూ ఉండేందుకు ఉపయోగపడే ప్రీమియం సిమెంటు సూపర్క్రీట్ను రామ్కో సిమెంట్స్ తెలుగు రాష్ట్రాల విపణిలోకి విడుదల చేసింది.
*జులై చివరినాటికి ద్రవ్యలోటు 5.47 లక్షల కోట్లను చేరింది. 2019-20 బడ్జెట్ అంచనాలో ఇది 77.8 శాతం. ఏడాదిక్రితం ఇదే సమయంలో ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్ అంచనాలో 86.5 శాతంగా నమోదైంది. ప్రభుత్వ వ్యయాలు, ఆదాయాల మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తారు.
*మేటి ఫీచర్ల.. ఏడో బీఎండబ్ల్యూ మరింత విశాలం.. ఎంతో అత్యాధునికం.. స్టైలిష్ రూపం.. బీఎండబ్ల్యూ 3సిరీస్ ఏడో జనరేషన్ కారు పరిచయ వాక్యాలివి… గతేడాది ప్యారిస్ మోటార్ షోలో మెరిసిన ఈ సెడాన్ భారతీయ విపణిలోకి వచ్చేసింది… 330ఐ, 320డీ అనే సెగ్మెంట్లలో స్పోర్ట్, లగ్జరీ లైన్, ఎం-స్పోర్ట్ అనే రకాల్లో అందుబాటులో ఉంది. *మార్పులు: పాత జనరేషన్ కారుతో పోలిస్తే మూలలు, ఆకారంలో చెప్పుకోదగ్గ మార్పులు చేశారు. 8 సిరీస్ స్ఫూర్తితో పొడవాటి కిడ్నీ గ్రిల్స్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ ఆకారంలో డీఆర్‌ఎల్‌లు అమర్చారు. 76 ఎంఎం పొడవు, 41 ఎంఎం వీల్‌బేస్ పెంచారు. బరువు 55కేజీలు తగ్గింది. బూట్ స్పేస్ సామర్థ్యం 481 లీటర్లకు పెరిగింది. దీన్ని పూర్తిగా చెన్నైలోని ప్లాంట్‌లోనే తయారు చేశారు. *ఫీచర్లు: డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్‌సోల్, హెడప్ డిస్‌ప్లే, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పార్కింగ్ అసిస్ట్, కీలెస్ ఎంట్రీ, 12.3 అంగుళాల తాకేతెరతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.. దీన్ని బీఎండబ్ల్యూ ఇంటలిజెంట్ పర్సనల్ అసిస్టెంట్‌తో అనుసంధానం చేసుకోవచ్ఛు *భద్రత: ఎప్పట్లాగే భద్రతకి పెద్దపీట వేశారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీబీసీ, ఎలక్ట్రిక్ పార్కింగ్, క్రాష్ సెన్సర్, ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ స్పేస్.. ఉన్నాయి. *ఇంజిన్: 8స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ట్విన్ పవర్ టర్బో 4 సిలిండర్, 2.0లీటర్ల పెట్రోల్, 3.0 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో వచ్చింది. 330ఐ మోడల్ అత్యధికంగా 258పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అత్యుత్తమ టార్క్ 1550 @ 4400 ఆర్‌పీఎం. 320డీ మోడల్ 190పీఎస్ ఉత్పత్తి చేస్తుంది. మేటి టార్క్ 400ఎన్‌ఎం@ 2500 ఆర్‌పీఎం. 5.8 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. *ఎక్స్ షోరూం ధరలు: రూ.41.40 లక్షలు (320డీ స్పోర్ట్స్), రూ.46.90లక్షలు (320డీ లగ్జరీ లైన్), రూ.47.90లక్షలు (330ఐ స్పోర్ట్).
* భారత్ విదేశీ మారక నిల్వలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఆగస్టు 23తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 145 కోట్ల డాలర్లు తగ్గి 42,905 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు 119.8 కోట్ల డాలర్లు తగ్గి 39,712.8 కోట్ల డాలర్లకు చేరాయి. సమీక్షా వారంలో బంగారం నిల్వలు 24.32 కోట్ల డాలర్లు తగ్గి 2,686.7 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద భారత్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కూడా 45 లక్షల డాలర్లు తగ్గి 143.3 కోట్ల డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్ వద్ద భారత్ నిల్వలు 362.1 కోట్ల డాలర్లకు తగ్గాయని భారత రిజర్వు బ్యాంకు తెలిపింది.
* ఆరున్నరేళ్ల కనిష్టానికి జీడీపీ
అనుకున్నదంతా అయ్యింది. అంచనాలకు తగినట్లు గానే స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఆరున్నరేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఏప్రిల్ –జూన్ 2019 క్వార్టర్లో ఇండియా ఎకానమీ కేవలం 5 శాతం పెరిగింది.అంతకు ముందు ఏడాదిలోని మొదటి క్వార్టర్లో ఇండియా ఎకానమీ 5.8 శాతం వృద్ధి చెందిం ది. ఈ ఆర్థిక సంవత్సరపు మొదటి క్వార్టర్లో ఆర్థిక వృద్ధి 5.7 శాతంగా ఉంటుం దని మార్కె ట్ అంచనా వేసింది. కానీ, వాస్తవ వృద్ధి దీనికంటే తక్కువగానే నమోదైంది. 2013 ఆర్థిక సంవత్సరపు మొదటి క్వార్టర్ తర్వా త జీడీపీ వృద్ధి ఇంత తక్కువగా ఉండటం ఇదే మొదటిసారి .
వాట్సాప్‌లో త్వరలో చెల్లింపు సేవలు-వాణిజ్యం-08/31
Related tags :