Business

నేను విలీనం చెప్పాను గానీ ఉద్యోగాలు పోతాయని చెప్పలేదు

నేను విలీనం చెప్పాను గానీ ఉద్యోగాలు పోతాయని చెప్పలేదు

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో పలువురి ఉద్యోగాలు పోతాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ‘‘అవన్నీ అవాస్తవ ప్రచారాలు. విలీనం కాబోతున్న బ్యాంకుల యూనియన్‌లు, ఉద్యోగులారా…శుక్రవారం నాడు నేను ఏం చెప్పానో ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేను కేవలం బ్యాంకుల విలీనం గురించి మాత్రమే మాట్లాడా. అంతేకానీ, ఏ ఉద్యోగినీ తొలగించబోం. అది ఎప్పటికీ జరగదు’’ అని అన్నారు. బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ, ఉద్యోగులను తగ్గించుకోవడానికే ఇలాంటి చర్యలు చేపడుతున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపించిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ సమాధానం ఇచ్చారు.