WorldWonders

భార్యలను చంపే భర్తలకు ఉండే లక్షణాలు

Here are the traits of husbands who might kill their wives

భార్య కానీ సహచరి కానీ తమ జీవిత భాగస్వామ్యులను హత్య చేసే పురుషులు ఒక హత్యా క్రమాన్ని అనుసరిస్తారని నేర శాస్త్రం ప్రవీణులైన డాక్టర్ జెన్ మంక్తాన్ స్మిత్ చెప్తున్నారు. యునివర్సిటీ ఆఫ్ గ్లోసేస్తర్ షైర్ లో లెక్చరర్ గా పని చేస్తున్న ఆమె బ్రిటన్ లో 372 హత్యలను అద్యయనం చేశారు. ఆ హత్యలన్నింటి లోనూ ఎనిమిది దశలుగా సాగిన ఒక హత్యాహత్య చేయగలడటానికి భౌతికంగా నియంత్రించే అతడి ప్రవర్తన కీలక సూచిక కావచ్చునని డాక్టర్ జెన్ పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో గుర్తించిన అంశాలు.. ప్రాణాలను కాపాడటానికి దోహద పడగలవని ఒక హతురాలి తండ్రి అభిప్రాయపడ్డాడు. పోలీసులు ఈ ఎనిమిది దశలను పసి గట్టగాలిగితే చాలా హత్యలను నివారించవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. జీవిత భాగస్వాములు చేతిలో హత్యకు గురవుతున్న వారిలో మహిళలు ఎనభై శాతం పైగా ఉన్నారని అత్యధిక ఉదాంతాల్లో హత్య చేసిన భాగస్వామి పురుషుదేనని డాక్టర్ జెన్ చెప్పారు. ఈ అద్యయనం కోసం హతురాలికి గతంలో కానీ, హత్య జరిగేనాటికి కానీ హంతకుడితో సంబందాలు ఉన్న కేసులన్నింటిని ఆమె నిశింతంగా పరిశీలించారు. అలాగే పురుషులు తమ పురుష భాగస్వామ్యల చేతుల్లో హతమైన ఉదంతాలను పరిశీలించారు.