తెదేపా వివాదాస్పద నేత, మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు పోల్లెసులకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇసుక రవాణా విషయంలో తనకి అడ్డు వచ్చిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కులం పేరుతొ దూశించాడు. దీంతో చింతమనేని పై ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటి కేసు నమోదైంది. తనపై పెట్టిన కేసు గురించి మీడియా ముందుకి వచ్చి మాట్లాడిన చింతమనేని తర్వాత ఎక్కడ కూడా కనిపించలేదు. చింతమనేని ఇంటి ముందు పోలీసులు ఉండగానే వాళ్ళ ముందు నుంచే చింతమనేని బయటకు వెళ్ళిపోయారు. చింతమనేని అడ్రస్ తెలియకపోవడంతో చాల మంది అతడు పోలీసులకు భయపడి పరారీలో ఉన్నాడని చెపుతున్నారు. కానీ పోలీసులు మాత్రం చింతమనేని కనిపించడం లేదని అతడి కోసం వెతుకుతున్నామని చెపుతున్నారు తాజాగా చింతమనేని వైకాపా మంత్రి కొడాలి నాని కారులో వెళుతున్నాడన్న వార్తల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చింతమనేని ఓ కారులో వెళ్తున్నాడన్నని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారు నెంబరుతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కారు చెక్ చేసి పట్టుకున్నారు. అయితే అందులో చింతమనేని లేడు. కారు మీద మాత్రం గుడివాడ వైకాప ఎమ్మెల్యే కొడాలి నాని పేరు రాసి ఉంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆకారు మీద మంత్రి కొడాలి నాని అని రాసి ఉంది దీనితో పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులకు చెప్పిన వాళ్ళు మాత్రం ఆ కారులోనే చింతమనేని తప్పించుకున్నాడని చెప్పారు. వాళ్ళు మాత్రం ఆ కారులోనే చింతమనేని నాని కారులో ఎందుకు వెళతాడని సందేహిస్తున్నారు. ఏదేమైనా పరారీలో ఉన్న చింతమనేని పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు.
చింతమనేని ఎక్కడ దాక్కున్నావమ్మా?
Related tags :