DailyDose

కరెంట్ షాక్ తగిలి ఇద్దరు రైతులు మృతి-నేరవార్తలు–09/06

Two farmers die in ananthapuram due to electric shock-telugu crime news

* అనంతపురము జిల్లా వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామంలో కరెంట్ షాక్ తో ఇద్దరు యువ రైతులు మృతి
తోటలో బోర్ లో నీరు రాక పోవడంతో పంట ఎండి పోతోందని పక్కనే ఉన్న హంద్రీనీవా కాలువ నుంచి నీళ్లు తీసుకుందామనే ప్రయత్నం చేస్తూ ..కాలువలోకి మోటర్ దింపుతుండగా .. ఒక్కసారి కరెంట్ పాస్ అయ్యి ఇద్దరు అన్నదములు యువ రైతులు అక్కడికి అక్కడే మృతి చెందడంతో ..ఆ గ్రామం శోకసంద్రం నిండి పోయింది.
* జైన సంప్రదాయం ప్రకారం ఏడు రోజుల పాటు ఉపవాస దీక్ష చేసిన పాతికేళ్ల జైన్‌ మహిళ ఏక్తా అశుభాయ్‌ గల హఠాన్మరణానికి గురయ్యారు. ఏక్తా ఉపవాసదీక్ష కోసం గుజరాత్‌లోని కచ్‌లో నెల కిందట పుట్టింటికి చేరుకున్నారు. ఆగస్ట్‌ 27న వారం రోజుల పాటు సాగే ఉపవాసదీక్షను ఆమె చేపట్టారు. ఐదు రోజుల తర్వాత ఆమె అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. ఆమెను పరీక్షించిన డాక్టర్‌ దీక్షను విరమించి రోజుకు ఒకసారైనా ఆహారం తీసుకోవాలని సూచించగా ఏక్తా నిరాకరించారు. సెప్టెంబర్‌ 3న ఏక్తా ఆరోగ్యం క్షీణించగా ఆమెకు గ్లూకోజ్‌ ఎక్కించారు. అప్పటికీ జైన విశ్వాసాల ప్రకారం ఆమె కేవలం బాయిల్డ్‌ వాటర్‌ను మాత్రమే సేవించేందుకు అంగీకరించారు. అదే రోజు రాత్రి ఆమె గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యారని ఏక్తా బంధువులు వెల్లడించారు.
* అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు కరెంట్‌ షాక్‌కు గురై మృత్యువాత పడ్డారు. వజ్రకరూరు మండలం పొట్టిపాడులో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
* నెల్లూరు జిల్లా కావలి రైల్వే రోడ్ లోని కామేశ్వరి బార్ & రెస్టారెంట్ ఎదురుగా ఉన్న స్టూడెంట్స్ భవనంలో అలహరి మధు (20 సం”) పురుగుల మందు సేవించి ఆత్మహత్యశ్రీ చైతన్య ప్రయివేటు కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గ్రామం తుమ్మల పెంట. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్న సహచర మిత్రులు.సూ సైడ్ నోట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
* దేశ రాజధానిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం 8లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.
* అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు కరెంట్‌ షాక్‌కు గురై మృత్యువాత పడ్డారు. వజ్రకరూరు మండలం పొట్టిపాడులో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
*మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలం రామకృష్ణాపూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువతిపై కమలాకర్ అనే వ్యక్తి దాడి చేసి సీసాతో గొంతులో పొడిచి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
*ఆమె నిండు గర్భిణి. కొద్ది రోజుల్లో పండంటి పాపకు జన్మనివ్వాల్సిన ఆమెను ఎవరో దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత పెట్రోలు పోసి తగలబెట్టారు. గర్భిణి శరీరం పూర్తిగా కాలిపోవడంతో కడుపులోని బిడ్డ కూడా బయటికి వచ్చి మంటల్లో మాడిపోయింది. మనసులను కలచివేసే ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో కలకలం రేపింది.
*గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు దుర్మరణం పాలయ్యాడు.రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని తొండుపల్లి వద్ద బెంగుళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
*అనంతపురం ఆటో టైరు పగిలి ఒక్కసారిగా ఊడిపోవడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కియా ఫ్యాక్టరీ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో కియా ఫ్యాక్టరీ సమీపంలోకి రాగానే.. టైరు పగిలి ఊడిపోవడంతో ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి.
*రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించి రూ.1600 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం విద్యానగర్లోని బీసీ భవన్లో జరిగిన రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కాలేజీ విద్యార్థుల కోసం 150 కాలేజీ హాస్టళ్లను మంజూరు చేయాలని, గురుకులాల్లో ఉన్నత విద్యనందించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.
*గంజాయి మత్తుకు అలవాటు పడి సెల్ఫోన్లను లాక్కెళ్తున్న ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం..శ్రీకాకుళం జిల్లా జగన్నాథపురం ప్రాంతానికి చెందిన పెద్దింటి యాదగిరి(20) సెంట్రింగ్ వర్కర్గా పనిచేస్తూ మూసాపేటలోని యాదవ బస్తీలో నివాసం ఉంటున్నాడు. అదే బస్తీలో నివాసం ఉంటున్న మహ్మ ద్ జబ్బార్ అహ్మద్ జులాయిగా తిరుగుతుంటాడు. వీరిద్దరూ కలిగి కొంతకాలంగా గంజాయికి అలవా టు పడ్డారు. డబ్బుల కోసం జూబ్లీహిల్స్లో ఫుట్పాత్పై నడుచుకుంటూ వెళ్లేవారి వద్దనుంచి సెల్ఫోన్ లాక్కెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు.
* అనంతపురము జిల్లా వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామంలో కరెంట్ షాక్ తో ఇద్దరు యువ రైతులు మృతితోటలో బోర్ లో నీరు రాక పోవడంతో పంట ఎండి పోతోందని పక్కనే ఉన్న హంద్రీనీవా కాలువ నుంచి నీళ్లు తీసుకుందామనే ప్రయత్నం చేస్తూ ..కాలువలోకి మోటర్ దింపుతుండగా .. ఒక్కసారి కరెంట్ పాస్ అయ్యి ఇద్దరు అన్నదములు యువ రైతులు అక్కడికి అక్కడే మృతి చెందడంతో ..ఆ గ్రామం శోకసంద్రం నిండి పోయింది.
* నరసరావుపేట మున్సిపల్ డ్రైనేజీ వాటర్ ప్లాంట్ లో పనిచేస్తున్న పీటర్ అనే వ్యక్తి ట్యాంక్ లో శవమై కనిపించాడు. ఇది హత్యే అంటూ కుటుంబసభ్యుల ఆరోపణ. ప్రాథమిక విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పిన పోలీసులు.