తుగ్లక్ పాలన అంటే చంద్రబాబు నాయుడిదే అనే విషయం లోకేశ్ తెలుసుకోవాలని పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. తుగ్లక్ అంటే ఎవరో అసలు లోకేశ్‌కు తెలుసా అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నుంచి మూటా- ముల్లె సర్దుకుని చంద్రబాబు పారిపోయివచ్చిన విషయం లోకేశ్ మర్చిపోయాడా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వంద రోజుల పాలనపై విమర్శలు గుప్పిస్తున్న లోకేశ్ తీరును బొత్స ఎండగట్టారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…వందరోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సీఎం జగన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. పెట్టిన తొలి సంతకాలకు చట్ట రూపం తెచ్చిన వ్యక్తి జగన్ అని పేర్కొన్నారు. నాడు చంద్రబాబు పెట్టిన మొదటి సంతకాలకు విలువలేకుండా పోయిందని.. ప్రతిపక్షంలో ఉండటాన్ని తట్టుకోలేకే ఆయన.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కిడ్నీ బాధితుల కోసం 200 పడకల ఆస్పత్రిని సీఎం జగన్ ప్రారంభించిన విషయం.. లోకేశ్, చంద్రబాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
తుగ్లక్ పాలన అంటే చంద్రబాబు నాయుడిదే
Related tags :