Kids

కృష్ణుడు సత్యభామకు బహుకరించిన పారిజాతం ఇదే

The story of parijata tree which lord krishna gifted to satyabhama

కృష్ణ పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహూకరించిన పారిజాత వృక్షం ఇదే.ఈ పారిజత వృక్షం ఉత్తరప్రదేస్ రాష్ట్రంలో బారబంకి జిల్లాలో లోని కింటూర్ గ్రామం వద్ద ఉంది .ప్రపంచంలో కెల్ల విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు.ఇది శాఖ ముక్కలు నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు.అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గం లో ఉంచబడింది ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం స్వంతం. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు , చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి, పై భాగన ఆకులు యేడు భాగాలుగా ఉంటాయి.వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు మరియు తెలుపు రంగులో కలిసిన ఒక ఆహ్లదకరమైన రంగులో ఉంటాయి.పుష్పాలు ఐదు రేకులు కలిగి ఉంటాయి.చాలా అరుదుగా ఈ వృక్షం వికసిస్తుంది అదీ జూన్ / జూలై నెలలో మాత్రమే. ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది.ఈ వృక్షం యొక్క వయస్సు సుమారు 1000 నుంచి 5000 సంవత్సరాలుగా చెప్పబడుతుంది . ఈ వృక్ష కాండము చుట్టుకొలత 50 అడుగులుగాను, ఎత్తు 45 అడుగుల గాను చెప్పబడింది. ఈ వృక్షం యొక్క మరొక గొప్పతనం దీని శాఖలు గాని ఆకులు గాని కుంచించుకుపోయి కాండంలో కలిసిపోవటమే కాని ఎండిపోయి రాలిపోవటం జరగదు.