వయసు అనేది ఒక అంకె మాత్రమే అంటారు. ఐతే చాలామంది, తమ వయసును దాచుకోవడానికి పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అటువంటి వారికి కనువిప్పు అన్నట్టుగా నా వయసు యాభై అహో అని ఢంకా బజాయించి మరీ చెబుతోంది హాలీవుడ్ సుందరి జెన్నీఫర్ లోపేజ్. అంతే కాకుండా వయసు పెరుగుతోందనే భయాన్ని మర్చిపోండి అని తోటి మహిళలకు సలహా ఇస్తోంది. నటి, గాయకురాలు, డ్యాన్సర్, ఫ్యాషన్ డిజైనర్, నిర్మాత, వ్యాపారవేత్త ఒక్క మాటలో చెప్పాలంటే జెన్నిఫర్ బహుముఖ ప్రజ్ఞా వంతురాలు. ‘‘నా వయసు 50 సంవత్సరాలు’ అని చెప్పినందుకు ‘నీకు పిచ్చి పట్టిందా’ అని చాలామంది అడిగారు. కానీ ఈ విషయాన్ని అందరూ ఎందుకు హైలైట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు. మహిళలు, మరీ ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలో, ఎలా ఆలోచించాలో, ఎలా మాట్లాడాలో ముందే డిజైన్ చేసి, కండిషన్ చేసి ఉంటుంది. ఇక్కడ బలహీన, సున్నిత మనసున్న వారు నిలబడలేరు. ఐతే నేను నా లాండ్ మార్క్ వయసును చేరుకున్నాను. అంత మాత్రాన నా ప్రయాణం ఆపవలసిన అవసరం లేదు, ఆపను’’ అని పేర్కొంది.
నా వయసు 50 సంవత్సరాలు
Related tags :