పీపీఏ(విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం)లపై ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది.
పాత పీపీఏల జోలికి వెళ్లబోమని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇంకా ఖరారు కాని ఒప్పందాలపైనే దృష్టిసారిస్తామని కేంద్రానికి లేఖ ద్వారా తెలిపింది.
పాత వాటిలో కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నవాటిని మాత్రమే సమీక్షిస్తామని వెల్లడించింది.
ఇకపై ఒప్పందం చేసుకునే వాటిలో కొత్త ధరలు నిర్ణయిస్తామని లేఖలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.