Devotional

తిరుమలకు ఉగ్రదాడి ముప్పు

Security High Alert Issued In Tirumala Amidst Intelligence Reports

దక్షిణాది రాష్ట్రాలకు ఉగ్రవాద ముప్పు ఉందనే కేంద్ర ఇంటలిజెన్స్‌ హ్చెరికల నేపథ్యంలో తిరుమలకొండపై భద్రతను కట్టుదిట్టం చేశారు. టీటీడీ వినతి మేరకు ఆక్టోపస్‌ రంగంలోకి దిగింది. తిరుమలపై సుమారు 40 మంది కమాండోలు డేగకన్ను వేసి ఉంచారు. శేషాచలంపై అణువణువు జల్లెడ పడుతున్నారు. తమిళనాడు లోని కోయంబత్తూరు లాంటి ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే విషయంపై గతంలో చాలాసార్లు ఐబీ హెచ్చరికలు వచ్చాయి. ఉగ్ర టార్గెట్ లో ఉందన్న సమాచారంతో దక్షిణాదిలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమలలో భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారని, దక్షిణాదిలో ఎప్పుడైనా, ఎక్కడైనా వాళ్ళు దాడులకు తెగబడే అవకాశాలున్నాయని ఆర్మీ ఇంటెలిజెన్స్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే.