NRI-NRT

చేనేత చేయూతకై తానా లాహిరి లాహిరి లాహిరిలో

TANA Conducts Hudson Cruise To Rise Funds For Telangana Weavers

లక్ష్మీ ఆసు యంత్ర సృష్టికర్త, ప్రముఖ చేనేత కళాకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతకింది మల్లేశం, తెలంగాణా ప్రభుత్వాల సంయుక్త సహకారంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 1000 ఆసు యంత్రాలను చేనేత కార్మికులకు పంపిణీ చేసేందుకు MoU కుదుర్చుకుంది. ఈ క్రమంలో భాగంగా ఆసు యంత్రాల కొనుగోలుకై ప్రవాసులను భాగస్వాములు చేస్తూ నిధుల సేకరణ కార్యక్రమాన్ని న్యూయార్క్/న్యూజెర్సీ తానా విభాగం ఆధ్వర్యంలో 8వ తేదీన చేపట్టారు. 450మందికి పైగా ప్రవాసులు హడ్సన్ నదిపై నౌకావిహారంలో ఉల్లాసంగా పాల్గొన్నారని, ఈ కార్యక్రమం ద్వారా 160 ఆసు యంత్రాల కొనుగోలుకు నిధులు లభించినట్లు తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తెలిపారు. సేవా కార్యక్రమాల్లో తానా సభ్యులను, ప్రవాసులను భాగస్వామ్యం చేసే దిశగా సంస్థ కృషి చేస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మన్ శృంగవరపు నిరంజన్, BoD ఛైర్మన్ కోయా హరీష్, తానా కార్యదర్శి పొట్లూరి రవి, అంతర్జాతీయ సమన్వయకర్త దేవినేని లక్ష్మీ, మహిళా విభాగ సమన్వయకర్త తూనుగుంట్ల శిరీష, ఇతర తానా ప్రతినిధులు యలమంచిలి రావు, నాయునిపాటి విశ్వనాథ్, విద్యా గారపాటి, తానా న్యూయార్క్ జట్టు సభ్యులు రాసపుత్ర శంకర్, పర్వతాల కిరణ్, వోలేటి రావు, చేకూరి పృధ్వీ, ముసునూరు దిలీప్, బాణోత్ అశోక్, సమ్మెట దీపిక, జూలూరు రజనీ, న్యూజెర్సీ తానా నుండి ఉప్పులూరి రేఖా, వాసిరెడ్డి వంశీ, నారెపాలెపు సుధీర్, సూర్యదేవర సాయి, తానా శివాని, ప్రవీణ్ రెడ్డి, సాయి పాలేటి, మాచర్ల రవి, మురళి, వర్ష నారెపాలెపు, గారపాటి కీర్తన, గారపాటి హర్ష, కసుకుర్తి అనింద్య, పోలవరపు రాఘవేంద్ర రావు, TLCA, TATA, TFAS ప్రతినిధులు అట్లూరి పూర్ణ, చింతకూంట అశోక్, కుదరవల్లి బాబు, ఖ్యాతం రంజిత్, వనమా రామా, రంగా మాడిశెట్టి, మధు రాచకుల్ల తదితరులు పాల్గొన్నారు. నౌకా విహార యాత్ర విజయవంతం కావడానికి సహకరించిన వారికి రామిశెట్టి సుమంత్, కసుకుర్తి రాజాలు ధన్యవాదాలు తెలిపారు.

https://www.youtube.com/watch?v=qZqaXuIM5ds

TANA NY/NJ Cruise Festival 2019 – Fund raising event for Weavers in Telangana, India. On Sept 8th, TANA Cruise event started with Ribbon cutting ceremony by Mr.Jay Talluri TANA President along with TANA Leadership team.  It was a fantastic fun-filled event, full of enjoyable things DJ, Music, dance floor, fun games and bingo. Around 450 people sailed on hudson river, experienced the breathtaking views Manhattan on a beautiful day. Kids had fun with face painting, magic-show, balloon twisting and tattoos. Niranjan Srungavarapu- Foundation Chairman, Harish Koya- Chairman & Board of Director, Ravi Potluri – Secretary spoke about distributing 1000 ASU machines to Pochampalli weavers and about MOU between TANA, Padmashri Mallesham and Telangana Government. During the event funds were raised for 160 ASU machines.

Laxmi Devineni – International coordinator and Sirisha Tunuguntla – Women’s services coordinator spoke about Women Empowerment and the upcoming community events. Rao Yalamanchali – Foundatation Trustee, Viswanath Nyuanpati – Foundation Trustee and Vidya Garapati ( Past NY/NJ- RVP) addressed the crowd to join the hands for this great cause. Excellent event coordination and execution by NY Team ( Shankar Rasaputra, Kiran Parvatala, Rao Voleti, Prudhvi Chekuri, Dilip Musunuru, Ashok Banoth, Deepika Sammeta and Rajani Juluru) and NJ Team Rekha Uppuluri, Vamsi Vasireddy, Sudheer Narlepalepu, Sai Surayadevara, Shivani Tana, Praveen Reddy, Sai Paleti, Ravi Macharla, Murali and young NJ TANA volunteers Varsha Narepalepu, Keerthana Garapati, Haasith Garapati, Anindya Kasukurthi. We have a huge participation and support by NY/NJ Local Telugu organizations Sri Raghava Rao Polavarapu, Sri Purna Atluri – TLCA ( BOT – Chairman), Ashok Chintakunta, TLCA President, Babu Kudaravalli, TLCA- Vice President, Ranjeet Khyatam ( Treasurer – T.A.T.A), Rama Vanama – Secretary TLCA, Ranga Madisetty – TFAS Vice President, Madhu Rachakulla – TFAS Secretary, Renu Tadepalli – TFAS Treasurer.  Special thanks to the TANA leadership, Donors, event sponsors, Friends, DJ, Media and Food partners ( Beenz Indian Restaurant, Happauge) and esteemed guests, being part of this event and making the event a successful one. Ramisetti Sumanth And Raja Kasukurthi thanked the volunteers and donors for making this event successful.