DailyDose

నేటి తాజా వార్తలు-09/13

Telugu Breaking News Today - Sep 13 2019

* శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో నిఘా వర్గాల హెచ్చరికతో భద్రతను కట్టుదిట్టం చేసారు
* జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యాటిస్తున్నారు. ఇకనుండి తన టార్గెట్ జగన్ నే అని పవన్ ప్రకటించాడు
* తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ తెదేపా నాయకుడు తోట త్రిమూర్తులు తన అనుచరులతో కలిసి తేదేపాకు రాజీనామా చేసాడు
* విజయ్ సినిమా హక్కులని ప్రిన్స్ మహేష్ బాబు కొనుగోలు చేసారు
* బాలీవుడ్ లో అగ్ర శ్రేణి హీరోయిన్లు కాజల్, తమన్నాల మధ్య విభేదాలు తీవ్రతరం అయ్యాయి
* నేల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసుల విచారణకు మాజీ మంత్రి సోమిరెడ్డి హాజరు అయ్యారు
* కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్కూటరు పై వెళ్తున్న ఇరువురు యువకులు డివైడర్ ను డీ అక్కడికక్కడే మృతిచెందారు
* తెదేపా నాయకురాలు నన్నపనేని రాజకుమారిని అరెస్ట్ చెయ్యాలని కోరుతూ మంగళగిరి ఎమెల్యే ఆర్ కే రెడ్డీ ఆధ్వర్యంలో పెద్ద ప్రదర్శన నిర్వహించారు
* మంత్రి పేర్ని నానిపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు బందరుకు చెందినా ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసారు
* తమ సమస్యలను పరిశ్కరించాలని కొరుతూ తెలంగాణకి చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావులను రామనగర్ గ్రామ కొడిమ్యాల మండలం రామ్ నగర్ కు చెందినా గ్రామ ప్రజలు అడ్డుకున్నారు
* ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివీ సింధు సిఎం జగన్ ను కలిసారు
* గుంటూరు శివారు లోని నల్ల చేరు ప్రాంతంలో గృహాల ముందు ఉంచిన 13 మోటారు సైకిల్ లను దుండగులు తగుల పెట్టారు
* బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ 26,27 తేదీలలో బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు
* చెన్నైలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరుపొందిన రీటా లంకా లింగం ఆత్మహత్యకు పాలుపడటం కలకలం సృష్టించింది
* భాజాపా, తెదేపా ఎజెండాను అనుసరిస్తుందని ఆ పార్టీ నాయకుడు మాజీ ప్రభుత్వ కార్యాదర్శి ఐ వై ఆర్ కృష్ణారావ్ అసంతృప్తి వ్యక్తపరిచారు
* కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎడ్యూరప్పకు భాజాపా అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యమంత్రి మంత్రుల కుటుంబ సభ్యులను పాలనుకు దూరంగా ఉంచాలని హెచ్చరించింది